IPL 2023 : రహానె విధ్వంసం.. ముంబైపై చెన్నై ఘనవిజయం

IPL 2023 : ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.

IPL 2023 : రహానె విధ్వంసం.. ముంబైపై చెన్నై ఘనవిజయం

IPL 2023, MI vs CSK

IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై చెన్నై విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 158 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

సీఎస్కే బ్యాటర్ అజింక్య రహానె రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 18.1 ఓవర్లలో చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 40 పరుగులు), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(16) రాణించారు.

Also Read..IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. తుశార్ దేశ్ పాండే, మిచెల్ సాంట్నర్ తలో రెండు వికెట్లు తీశారు. మగళ ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కాగా, ముంబైకి వరుసగా రెండో పరాజయం.

Also Read..MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

చెన్నై తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఇక, ముంబై తన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్ లో ముఖ్యంగా రహానె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రహానె తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. పరుగుల వరద పారించాడు. ఒకే ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్ లో 6,4,4,4,4,1 కొట్టాడు. దాంతో ఒకే ఓవర్ లో 23 పరుగులు వచ్చాయి. ఇక, రహానె కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం హైలైట్.