IPL 2023: ఢిల్లీపై పంజాబ్ విజ‌యం

ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది.

IPL 2023: ఢిల్లీపై పంజాబ్ విజ‌యం

DCvs PBKS

DC vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 May 2023 11:06 PM (IST)

    పంజాబ్ విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో 31 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

  • 13 May 2023 10:45 PM (IST)

    అమన్ హకీమ్ ఖాన్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్ లో అమన్ హకీమ్ ఖాన్(16) హర్‌ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ 118 ప‌రుగుల(15.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

  • 13 May 2023 10:41 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న ప్ర‌వీణ్ దూబే, అమన్ హకీమ్ ఖాన్

    88 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీని ప్ర‌వీణ్ దూబే, అమన్ హకీమ్ ఖాన్ లు ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 15 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 115/6. ప్ర‌వీణ్ దూబే(13), అమన్ హకీమ్ ఖాన్(15) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 10:18 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    ఢిల్లీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో తొలి బంతికి రిలీ రోసో ఔట్ కాగా ఆఖ‌రి బంతికి దూకుడుగా ఆడుతున్న వార్న‌ర్ ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 86 ప‌రుగుల(8.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 86/4.

  • 13 May 2023 10:12 PM (IST)

    రిలీ రోసో ఔట్‌

    ఢిల్లీ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రిలీ రోసో(5) సికింద‌ర్ ర‌జా చేతికి చిక్కాడు. దీంతో 81 ప‌రుగుల(8.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.

  • 13 May 2023 10:07 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్(3) ఎల్భీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 74 ప‌రుగుల(7.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది.

  • 13 May 2023 10:04 PM (IST)

    వార్న‌ర్ అర్ధ‌శ‌త‌కం

    దూకుడుగా ఆడుతున్న వార్న‌ర్.. రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో(7.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 23 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది వార్న‌ర్‌కు 60వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

  • 13 May 2023 10:02 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ ఔట్‌

    ఎట్ట‌కేల‌కు పంజాబ్ బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్(21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 69 ప‌రుగుల(6.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 73/1. డేవిడ్ వార్న‌ర్‌(49), మిచెల్ మార్ష్‌(3) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 09:55 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఢిల్లీకి పోయేది ఏమీ లేక‌పోవ‌డంతో ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వార్న‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డుతున్నాడు. 6 ఓవ‌ర్ల ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 65/0. డేవిడ్ వార్న‌ర్‌(48), ఫిలిప్ సాల్ట్ (17) లు క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 09:11 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 168

    ఓపెన‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శ‌త‌క్కొట్ట‌డంతో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 103 ప‌రుగులు చేసి ఐపీఎల్‌తో త‌న తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. మిగిలిన వారిలో సామ్ క‌ర‌న్ (20), సికింద‌ర్ ర‌జా(11 నాటౌట్‌) రెండు అంకెల స్కోర్ దాటారు. శిఖ‌ర్ ధావ‌న్(7), లివింగ్ స్టోన్‌(4), జితేశ్ శ‌ర్మ‌(5), హ‌ర్‌ప్రీత్ బార్(2) లు దారుణంగా విప‌లం అయ్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్‌, ప్ర‌వీణ్ దూబే, కుల్దీప్ యాద‌వ్‌, ముకేశ్ కుమార్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 13 May 2023 08:57 PM (IST)

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సెంచ‌రీ

    పంజాబ్ ఓపెన‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సెంచ‌రీ చేశాడు. ఖ‌లీద్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో(17.4వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో ఐపీఎల్‌లో తొలి సెంచ‌రీ బాదాడు. 18 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్ 154/5. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(103), షారుక్ ఖాన్(1) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 08:52 PM (IST)

    హ‌ర్‌ప్రీత్ బార్ ఔట్‌

    కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవ‌డంతో హ‌ర్‌ప్రీత్ బార్(2) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 129 ప‌రుగుల(16.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్ 141/5. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(90), షారుక్ ఖాన్(1) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 08:43 PM (IST)

    సామ్‌క‌ర‌న్ ఔట్‌

    పంజాబ్ మ‌రో వికెట్‌ను కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో అమన్ హకీమ్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో సామ్ క‌ర‌న్‌(20) ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో పంజాబ్ 117 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్ 117/4. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(69), హర్‌ప్రీత్ బ్రార్(0) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 08:32 PM (IST)

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్ధ‌శ‌త‌కం

    అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఐపీఎల్‌లో ఐదో హాఫ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు. 13 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్ 99/3. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(53), సామ్ క‌రన్‌(18) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 08:02 PM (IST)

    జితేశ్ శ‌ర్మ‌ క్లీన్ బౌల్డ్

    పంజాబ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో జితేశ్ శ‌ర్మ‌(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 45 ప‌రుగుల(5.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 46/3. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(21), సామ్ క‌రన్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 07:57 PM (IST)

    లివింగ్ స్టోన్ ఔట్

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 32 ప‌రుగుల(4.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 38/2. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(14), జితేశ్ శ‌ర్మ‌(5) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 07:46 PM (IST)

    శిఖ‌ర్ ధావ‌న్ ఔట్‌

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కింగ్స్ షాక్ త‌గిలింది. ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో రిలీ రోసో క్యాచ్ అందుకోవ‌డంతో కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ (7) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 10 ప‌రుగుల(1.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 14/1. లివింగ్ స్టోన్‌(4), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(1) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 07:10 PM (IST)

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), సామ్ క‌ర‌న్‌, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

  • 13 May 2023 07:09 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), మిచెల్ మార్ష్, రిలీ రోసో, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

  • 13 May 2023 07:08 PM (IST)

    టాస్ గెలిచిన ఢిల్లీ

    టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ వార్న‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట‌గా పంజాబ్ బ్యాటింగ్ చేయ‌నుంది.