IPL2023 Final: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై చెన్నై విజయం.. కప్పు ధోని సేనదే
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.

IPL Final2023 GT vs CSK
IPL Final: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
చెన్నై విజయం
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
డెవాన్ కాన్వే ఔట్
ఒకే ఓవర్లో చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో డెవాన్ కాన్వే(47) ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 78 పరుగుల(6.6వ ఓవర్) వద్ద రెండో వికెట్ వికెట్ కోల్పోయింది.
-
రుతురాజ్ ఔట్
చెన్నైకి గట్టి దెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్(26) ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 74 పరుగుల(6.3వ ఓవర్) వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
-
దూకుడుగా ఆడుతున్న చెన్నై ఓపెనర్లు
ఓవర్లు కుదించడంతో చెన్నై ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే పూర్తి అయ్యింది. 4 ఓవర్లకు చెన్నై స్కోరు 52/0. డేవాన్ కాన్వే (27), రుతురాజ్ గైక్వాడ్ (23)లు క్రీజులో ఉన్నారు.
-
ఓవర్ల కుదింపు.. చెన్నై లక్ష్యం 171
వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. చెన్నై లక్ష్యాన్ని 171 గా నిర్దేశించారు. పవర్ ప్లే ను 4 ఓవర్లకు కుదించారు. ఒక్కొ బౌలర్ గరిష్టంగా మూడు ఓవర్లు వేయొచ్చు.
-
నిలిచిన వర్షం
వర్షం తెరిపినిచ్చింది. పిచ్‌పై కవర్లను తొలగించారు. మైదాన సిబ్బంది ప్రత్యేక యంత్రాలను గ్రౌండ్‌ను ఆటకు సిద్దం చేస్తున్నారు.
-
మొదలైన వర్షం.. ఆగిన మ్యాచ్
లక్ష్య ఛేదనకు చెన్నై దిగింది. మూడు బంతులు ఆడారో లేదో వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
-
చెన్నై లక్ష్యం 215
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టగా వృద్ధిమాన్ సాహా(54; 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 నాటౌట్; 12 బంతుల్లో 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరన రెండు, జడేజా, దీపక్ చాహర్‌లు చెరో వికెట్ తీశారు.
-
సాయి సుదర్శన్ అర్ధశతకం
పతిరన బౌలింగ్‌లో(15.3వ ఓవర్) ఫోర్ కొట్టి 33 బంతుల్లో సాయి సుదర్శన్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో సుదర్శన్‌కు ఇది మూడో అర్ధశతకం
-
సాహా ఔట్
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ధోని చేతికి సాహా(54) చిక్కాడు. దీంతో గుజరాత్ 131 పరుగుల(13.6వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు గుజరాత్ స్కోరు 131/2. హార్ధిక్ పాండ్యా(), సాయి సుదర్శన్(36)లు క్రీజులో ఉన్నారు.
-
సాహా అర్ధశతకం
వృద్ధిమాన్ సాహా దూకుడుగా ఆడుతున్నాడు. జడేజా బౌలింగ్‌లో(12.3వ ఓవర్) ఫోర్ కొట్టి 36 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు.
-
గిల్ స్టంపౌట్
ఎట్టకేలకు చెన్నై వికెట్ తీసింది. దూకుడుగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్(39) ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 67 పరుగుల(6.6వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు గుజరాత్ స్కోరు 67/1. వృద్ధిమాన్ సాహా(28), సాయి సుదర్శన్(0)లు క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే పూర్తి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది గుజరాత్ టైటాన్స్. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్లు దూకుడుగా ఆడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొడుతున్నారు. పవర్ ప్లే పూర్తి అయ్యింది. 6 ఓవర్లకు గుజరాత్ స్కోరు 62/0. వృద్ధిమాన్ సాహా(26), శుభ్‌మన్‌గిల్(36) క్రీజులో ఉన్నారు.
-
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
-
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
-
టాస్ గెలిచిన చెన్నై
ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచింది. సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.