IPL2023: ఐపీఎల్ ఫైన‌ల్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ఆ జ‌ట్టే విజేత‌..? నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే..?

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) జ‌ట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంది.

IPL2023: ఐపీఎల్ ఫైన‌ల్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ఆ జ‌ట్టే విజేత‌..?  నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే..?

ipl final gt vs csk

IPL2023 Final: క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఫైన‌ల్(IPL2023 Final) మ్యాచ్ ఈ రోజే. టోర్నీలో నిల‌క‌డ‌గా విజ‌యాలు సాధించిన రెండు జ‌ట్లు ఫైన‌ల్ చేరుకున్నాయి. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) జ‌ట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంది.

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో క‌ప్పును ఎవ‌రు ముద్దాడుతారు అన్న దానిక‌న్నా వ‌ర్షం కార‌ణంగా ఫైన‌ల్ మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి..? ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అన్న ప్ర‌శ్న అభిమానుల మ‌దిలో మెదులుతోంది. వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో తేలిక‌పాటి జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది.

IPL Final 2023: గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో టాస్ ఓడిన జట్లే కప్ గెలిచాయా? మరి ఈ సారి..

మ్యాచ్ ర‌ద్దైతే..?

భారీ వ‌ర్షం ప‌డి ఆదివారం మ్యాచ్‌ను నిర్వ‌హించే ప‌రిస్థితులు లేన‌ట్లు అయితే సోమ‌వారం నాడు మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజును ఫైన‌ల్ కోసం రిజ‌ర్వ్ డే గా షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సమ‌యంలోనే బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఒక‌వేళ మ్యాచ్ మొద‌లై మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌డి ఆగిపోతే.. ఎక్క‌డైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే సోమ‌వారం నిర్వ‌హిస్తారు. ఒక‌వేళ సోమ‌వారం రోజు కూడా వ‌ర్షం ప‌డి మ్యాచ్ జ‌ర‌గ‌ని ప‌క్షంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం లీగ్ ద‌శ‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజ‌రాత్ టైటాన్స్‌ను విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ఆల‌స్యంగా అంటే రాత్రి 9.40 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభ‌మైనా ఓవ‌ర్ల‌లో ఏ మాత్రం కోత విధించ‌రు. ఆ స‌మ‌యం దాటితే మాత్రం ఓవ‌ర్ల‌లో కోత విధిస్తారు. మ్యాచ్‌లో ఫ‌లితం తేలాలి అంటే ఇరు జ‌ట్లు క‌నీసం ఐదు ఓవ‌ర్లు అన్నా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు డ‌క్ వ‌ర్త్ లూయిస్ విధానం అమ‌లు చేసేందుకు అవ‌కాశం ఉంది. ఐదు ఓవ‌ర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాని ప‌క్షంలో సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ 12.50కి ప్రారంభం అవుతుంది. సూప‌ర్ ఓవ‌ర్ కూడా నిర్వ‌హించేందుకు ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోతే అప్పుడు మ్యాచ్ ర‌ద్దు చేస్తారు.

IPL 2023 Final: ఫైనల్ పోరులో గుజరాత్‌ విజయం ఖాయమా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే