IPL 2023 Final: ఫైనల్ పోరులో గుజరాత్‌ విజయం ఖాయమా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే

ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరోసారి విజయం సాధించాయి.

IPL 2023 Final: ఫైనల్ పోరులో గుజరాత్‌ విజయం ఖాయమా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే

IPL 2023 Final

GT vs CSK: ఐపీఎల్ 2023 సీజన్ నేటితో ముగియనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ రాత్రి 7.30గంటలకు ప్రారంభమవుతుంది. వరుసగా రెండో ఏడాది టైటిల్ ను దక్కించుకోవాలని గుజరాత్ జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు ఐదో సారి కప్ తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా ముంబై జట్టు రికార్డును సమం చేయొచ్చని ధో్నీ సేన భావిస్తోంది. అయితే, క్వాలీఫయర్2 మ్యాచ్‌లో ముంబయి జట్టుపై రెచ్చిపోయిన శుభ్‌మన్ గిల్ మరోసారి పరుగుల వరద పారిస్తే చెన్నై జట్టుకు ఇబ్బందికర అంశమే. దీంతో గిల్‌ను త్వరగా పెవిలియన్ బాటపట్టించేందుకు ధోనీ సేన ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

IPL 2023: ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిఉంటే రోహిత్ సేన విజయం సాధించేదా? అసలు ఇషాన్‌కు ఏమైంది..

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్ల బలాబలాలు ..

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. శుబ్‌మన్ గిల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్‌లో16 మ్యాచ్‌లలో 851 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, విజయశంకర్ రాణిస్తే భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ విభాగంలో.. గుజరాత్ జట్టులో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ ఉన్నారు. వీరు మంచి ప్రదర్శన ఇస్తున్నారు. షమీ 16 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు. రషీద్ 16 మ్యాచ్ లలో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే రెండు విభాగాల్లో గుజరాత్ జట్టు బలంగా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బలంగాఉంది. బ్యాటింగ్ విభాగంలో డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. వీరితోపాటు రెహాన్, దూబే, జడేజాతో పాటు కెప్టెన్ ఎం.ఎస్. ధోని ఉండనేఉన్నారు. బౌలింగ్ విభాగంలో తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా, మతీష పతిరన, దీపక్ చాహర్ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. వీరికితోడు ధోనీ కెప్టెన్సీ చెన్నై జట్టుకు అదనపు బలం.

IPL2023: ఐపీఎల్ విజేత‌కు ఎన్నికోట్లంటే..? ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ ఆట‌గాళ్ల‌కి ఎంతిస్తారంటే..?

గుజరాత్, చెన్నై జట్ల గణాంకాలు ఇలా..

– ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఆ రెండు జట్లు చెరోసారి విజయం సాధించాయి.

– ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. వాటిల్లో మూడు మ్యాచ్‌లలో గుజరాత్ జట్టు విజయం సాధించింది. చెన్నై కేవలం ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది.

– అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు ఒక్కసారి తలపడగా గుజరాత్ జట్టు విజయం సాధించింది.

– మొత్తం 15 ఐపీఎల్ ఫైనల్స్ జరగగా.. తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది.

– ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) జట్ల తర్వాత వరుసగా రెండేళ్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది.