IPL2023: ముంబై పై గుజ‌రాత్ విజ‌యం.. ఫైన‌ల్‌కు దూసుకువెళ్లిన హార్దిక్ సేన‌

ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

IPL2023: ముంబై పై గుజ‌రాత్ విజ‌యం.. ఫైన‌ల్‌కు దూసుకువెళ్లిన హార్దిక్ సేన‌

Qualifier 2 GT Vs MI

GT Vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 26 May 2023 11:58 PM (IST)

    గుజ‌రాత్ విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ ఫైన‌ల్‌కు చేరుకుంది. ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 18.2 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

  • 26 May 2023 11:37 PM (IST)

    సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌

    ధాటిగా ఆడుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్‌(61)ను మోహిత్ శ‌ర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై 155 ప‌రుగుల(14.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 26 May 2023 11:32 PM (IST)

    సిక్స్‌తో సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ

    సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న ఫామ్‌ని కొన‌సాగిస్తున్నాడు. జాషువా లిటిల్ బౌలింగ్‌(13.4వ ఓవ‌ర్)లో సిక్స్ కొట్టి 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజ‌న్‌లో సూర్య‌కు ఇది 5వ అర్ధ‌శ‌త‌కం.

  • 26 May 2023 11:15 PM (IST)

    కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్

    ముంబై మ‌రో వికెట్ కోల్పోయింది. జాషువా లిటిల్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై 124 ప‌రుగుల(11.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 26 May 2023 10:54 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే పూర్తి

    ల‌క్ష్య ఛేద‌న‌లో ప‌వ‌ర్ ప్లే పూర్తి అయ్యే స‌రికి ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 72/3. సూర్య‌కుమార్ యాద‌వ్‌(12), కామెరూన్ గ్రీన్‌(7) క్రీజులో ఉన్నారు.

  • 26 May 2023 09:56 PM (IST)

    ముంబై ల‌క్ష్యం 234

    కీల‌క పోరులో శుభ్‌మ‌న్ గిల్(129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్‌(43; 31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మిగిలిన వారిలో సాహా 18, హార్ధిక్ పాండ్యా 28* ప‌రుగులు చేశారు. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాశ్ మ‌ద్వాల్, పీయూష్ చావ్లా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 26 May 2023 09:38 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఆకాశ్ మ‌ద్వాల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (129) అద్భుత ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. దీంతో 192 ప‌రుగుల‌(16.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 198/2. హార్దిక్ పాండ్యా(5), సాయి సుద‌ర్శ‌న్‌(38) క్రీజులో ఉన్నారు.

  • 26 May 2023 09:16 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ శ‌త‌కం.. ఈ సీజ‌న్‌లో మూడోది

    ఈ సీజ‌న్‌లో శుభ్‌మ‌న్ గిల్‌ను ఆప‌డం బౌల‌ర్ల వ‌ల్ల కావ‌డం లేదు. సంచ‌ల‌న ఫామ్‌ను కొన‌సాగిస్తూ ముంబై పై గిల్ సెంచ‌రీ చేశాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో(14.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 49 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో అత‌డు శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అత‌డికి ఇది మూడో శ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం.

  • 26 May 2023 08:53 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ అర్ధ‌శ‌త‌కం

    సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తూ ఈ సీజ‌న్‌లో మ‌రో అర్ధ‌శ‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు శుభ్‌మ‌న్ గిల్.. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో(9.3వ ఓవ‌ర్‌) కి సింగిల్ తీసి 32 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 10 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 91/1. శుభ్‌మన్ గిల్‌(57), సాయిసుద‌ర్శ‌న్‌(13) క్రీజులో ఉన్నారు.

  • 26 May 2023 08:34 PM (IST)

    సాహా ఔట్‌

    ఎట్ట‌కేల‌కు ముంబై బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. ఏడో ఓవ‌ర్‌ను పీయూష్ చావ్లా వేయ‌గా మూడో బంతిని వైడ్ గా వేశాడు. అయితే సాహా ఆ బంతిని ముందుకు వ‌చ్చి ఆడే ప్ర‌య‌త్నం చేయ‌గా వికెట్ కీప‌ర్ అందుకుని వికెట్ల‌ను గిరాటేశాడు. దీంతో 54 ప‌రుగుల(6.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 26 May 2023 08:30 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే పూర్తి.. నిల‌క‌డ‌గా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లు

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది గుజ‌రాత్. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. శుభ్‌మ‌న్ గిల్ వేగంగా ఆడుతుండ‌గా వృద్ధిమాన్ సాహా బంతికో ప‌రుగు చొప్పున సాధిస్తున్నాడు. ప‌వ‌ర్ ప్లే ముగిసింది. 6 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 50/0. శుభ్‌మన్ గిల్‌(31), వృద్ధిమాన్ సాహా(18) క్రీజులో ఉన్నారు.

  • 26 May 2023 07:53 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

  • 26 May 2023 07:52 PM (IST)

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్

  • 26 May 2023 07:48 PM (IST)

    టాస్ గెలిచిన ముంబై

    ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫ‌య‌ర్ 2లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజ‌రాత్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.