IPL 2023: కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయర్లు అందరూ రెడ్ జెర్సీ ధరించకుండా గ్రీన్ జెర్సీతో ఎందుకు ఆడారో తెలుసా?

IPL 2023: సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు.

IPL 2023: కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయర్లు అందరూ రెడ్ జెర్సీ ధరించకుండా గ్రీన్ జెర్సీతో ఎందుకు ఆడారో తెలుసా?

IPL 2023

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL-2023) 32వ మ్యాచులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) జట్టు గ్రీన్ జెర్సీ (Green Jersey)లను ధరించింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ ఈ లేత ఆకుపచ్చ రంగు జెర్సీలను ధరించి కనపడ్డారు.

ఆర్సీబీ ఫ్రాంచైజ్ గో గ్రీన్ (Go Green) కార్యక్రమంలో భాగంగా ఈ జెర్సీలను చెత్త నుంచి తయారు చేశారు. స్టేడియంలోని వ్యర్థాలను వాడి జెర్సీలను తయారు చేసి స్ఫూర్తిగా నిలిచారు. సౌత్ బెంగళూరులోని రెండు సరస్సులను పూర్వస్థితికి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం సహకరిస్తుందని ఆర్సీబీ ఫ్రాంచైజ్ భావిస్తోంది. అలాగే, 200 పాఠశాలలను ఇందులో భాగస్వామ్యం చేస్తోంది.

సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు. జెర్సీ కింది భాగం కూడా అదే రంగులో ఉంది.

మ్యాచు ప్రారంభానికి ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ పచ్చని మొక్కలను పట్టుకుని గో గ్రీన్ సందేశాన్ని ఇచ్చారు. పర్యావరణం పరిశుభ్రంగా, పచ్చదనంలో నిండిపోయి ఉండాలన్న ఉద్దేశంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ 2011 సీజన్ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

IPL 2023, RCB vs RR: మ్యాక్స్‌వెల్ ఔట్‌.. నాలుగో వికెట్ కోల్పోయిన బెంగ‌ళూరు..Live Updates