IPL 2023, SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి.. Live Updates
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.

IPL 2023, SRH vs RR
IPL 2023, SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 204 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు బట్లర్ (54), యశస్వి జైశ్వాల్ (54), కెప్టెన్ సంజు శాంసన్ (55) అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో రాజస్థాన్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లకు 203/5 గా నమోదైంది. అనంతరం, బ్యాటింగ్ లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా విఫలమైంది. 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.
LIVE NEWS & UPDATES
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి
రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో రాణించకపోవడంతో రాజస్థాన్ 203 పరుగులు బాదింది. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 27, అబ్దుల్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరి వ్యక్తిగత స్కోరూ కనీసం 20 దాటలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహెల్ 4, బౌల్ట్ 2, హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.
-
ఎనిమిదో వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ 6 పరుగులకే చాహెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రీజులో అబ్దుల్ (16), ఉమ్రాన్ మాలిక్ (0) ఉన్నారు. హైదరాబాద్ స్కోరు 95/8 (18 ఓవర్లకు)గా ఉంది.
-
ఏడో వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడో వికెట్ కోల్పోయింది. ఫిలిప్స్, అగర్వాల్ ఔటయ్యాక కాసేపటికే రషీద్ 18 పరుగులు చేసి చాహెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
-
ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ కోల్పోయింది. ఫిలిప్స్ (8), అగర్వాల్ (27) ఔటయ్యారు. క్రీజులో అబ్దుల్, రషీద్ ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 68/6 (12.2/20)గా ఉంది.
-
నాలుగో వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రూక్ ఔటైన కాసేపటికే వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగుకే హోల్డర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
-
మూడో వికెట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. బ్రూక్ 13 పరుగులకు చాహెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
-
6 ఓవర్లకు 30/2
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 6 ఓవర్లకు 30/2గా ఉంది. మయాంక్ అగర్వాల్ (21), బ్రూక్ (13) నిలకడగా ఆడుతున్నారు.
-
తొలి ఓవర్లోనే సన్‌రైజర్స్ కు షాక్.. 2 వికెట్లు డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ షురూ చేసిన కాసేపటికే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్లో 3వ బంతికే బౌల్ట్ బౌలింగ్ లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి కూడా 5వ బాల్ కే వెనుదిరిగాడు. మొదటి ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 0/2గా ఉంది.
-
తొలి వికెట్ డౌన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ షురూ చేసింది. క్రీజులోకి ఓపెనర్లుగా అభిషేక్, అగర్వాల్ వచ్చారు. తొలి ఓవర్లో 3వ బంతికే బౌల్ట్ బౌలింగ్ లో అభిషేక్ డకౌట్ అయ్యాడు.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 204
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 204 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు బట్లర్ (54), యశస్వి జైశ్వాల్ (54), కెప్టెన్ సంజు శాంసన్ (55) అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో రాజస్థాన్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లకు 203/5 గా నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖీ, నటరాజన్ రెండేసి వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్టు పడగొట్టారు.
-
5వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ 5వ వికెట్ కోల్పోయింది. పరాగ్ 7 పరుగులకి ఔటయ్యాక సంజు శాంసన్ 55 పరుగులకు ఔటయ్యాడు. జట్టు స్కోరు 191/5 (18.4/20)గా ఉంది.
-
సంజు శాంసన్ అర్ధ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, కెప్టెన్ సంజు శాంసన్ కూడా అర్ధ సెంచరీ బాదాడు. ఇప్పటికే ఆ జట్టులో బట్లర్ (54), యశస్వి జైశ్వాల్ (54) హాఫ్ సెంచరీలు కొట్టారు. సంజు శాంసన్ 28 బంతుల్లో 4 సిక్సులు 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అతడికి ఇది 18వ ఐపీఎల్ అర్ధ సెంచరీ. రాజస్థాన్ స్కోరు 172/4 (16.4/20)గా ఉంది.
-
నాలుగో వికెట్
రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. పరాగ్ 7 పరుగులకే నటరాజన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సంజు శాంసన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
-
రాజస్థాన్ రాయల్స్ స్కోరు 160/3
రాజస్థాన్ రాయల్స్ స్కోరు 160/3 (15 ఓవర్లకు)గా ఉంది. క్రీజులో సంజు శాంసన్ (41), పరాగ్ (5) ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ (54) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పడిక్కల్ 2 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజులో సంజు శాంసన్ (39), పరాగ్ (4) ఉన్నారు.
-
యశస్వి జైశ్వాల్ కూడా హాఫ్ సెంచరీ బాది ఔట్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ (54) బాదాక ఔట్ అయ్యాడు. జోస్ బట్లర్ కూడా హాఫ్ సెంచరీ (54) చేసి ఔటైన విషయం తెలిసిందే. క్రీజులో సంజు శాంసన్ (37), పడిక్కల్ (0) ఉన్నారు. స్కోరు 147/2 (13.1/20)గా ఉంది.
-
యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ బాదాడు. 34 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ కూడా హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. క్రీజులో యశస్వి జైశ్వాల్ (50), సంజు శాంసన్ (30) ఉన్నారు.
-
8 ఓవర్లకు 105/1
రాజస్థాన్ రాయల్స్ స్కోరు 8 ఓవర్లకు 104/1గా ఉంది. యశస్వి జైశ్వాల్ (39), జోస్ బట్లర్ (11) క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ ఔట్
దూకుడుగా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్.. అనంతరం ఫరూఖీ బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రీజులో జైశ్వాల్ (30), సంజు శాంసన్ (0) ఉన్నారు.
-
20 బంతుల్లో బట్లర్ హాఫ్ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ బాదాడు. 20 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.
-
3 ఓవర్లలో 37 పరుగులు
మూడు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (24), జోస్ బట్లర్ (12) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్లో 6 పరుగులు
తొలి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (5), జోస్ బట్లర్ (0) క్రీజులో ఉన్నారు.
-
బ్యాటింగ్ షురూ
రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ వచ్చారు.
-
నేటి మ్యాచుకు మాత్రమే నేను కెప్టెన్: భువనేశ్వర్
పిచ్ పరిస్థితుల దృష్ట్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నామని, లక్ష్యఛేదనలో దీన్ని అనుకూలంగా మార్చుకుంటామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. నేటి మ్యాచుకు మాత్రమే తాను కెప్టెన్ గా ఉంటున్నానని తెలిపాడు. జట్టుకు అన్ని రకాలుగా అవసరమైన మేరకు అత్యుత్తమంగా సారథ్య బాధ్యతలు వహించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. తమ జట్టులో ఫరూకీ, హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు.
-
భువనేశ్వర్ కుమార్ సేన
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ
-
సంజు శాంసన్ సేన
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదాత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, చాహెల్
-
హైదరాబాద్ బౌలింగ్
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టాండిన్-కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఆడడం లేదు.
-
ఐపీఎల్ జోష్
-
పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలి
మ్యాచ్ కి 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలి. సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్ మధ్యలో ఎవ్వరు స్టేడియం లోపలికి వెళ్లవద్దు.