IPL 2023 : ముంబైకి బిగ్ షాక్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం

IPL 2023 MI VS LSG : 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో పరాజయం పాలైంది.

IPL 2023 : ముంబైకి బిగ్ షాక్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం

LSG Vs MI

IPL 2023 MI VS LSG : కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో లక్నో విక్టరీ కొట్టింది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో పరాజయం పాలైంది.

ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్(59), రోహిత్ శర్మ(37) శుభారంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం అయ్యారు. చివరల్లో టిమ్ డేవిడ్(32) ధాటిగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ ఆఖరి ఓవర్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దాంతో 5 పరుగుల తేడాతో ముంబై ఓటమిపాలైంది.

Also Read..IPL 2023 : నేను బౌలింగ్ చేసుంటే.. 40 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్ : విరాట్ కోహ్లి

తొలుత బ్యాటింగ్ చేసిన లక్కో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లక్నో జట్టులో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ చెలరేగిపోయాడు. పవర్ హిట్టింగ్ తో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి అజేయంగా
నిలిచాడు.

స్టొయినిస్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో స్టొయినిస్ రెచ్చిపోయాడు. స్టొయినిస్ ధాటికి చివరి 5 ఓవర్లలో లక్నో జట్టుకు 69 పరుగులు లభించాయి. ముంబై బౌలర్లలో జాసన్ బెహరెన్ డార్ఫ్ 2 వికెట్లు తీశాడు. పియూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read..IPL 2023: ఎవరెవరు సెంచరీలు చేశారు? అత్యధిక హాఫ్ సెంచరీలు చేసింది ఎవరో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడ్డాయి.