IPL 2023: ఐపీఎల్‌లో అగ్రస్థానంలో ఇప్పటికీ ఆ జట్టే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌ల రేసులో ఆ హీరోలు మారారు

IPL 2023: అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో డు ప్లెసిస్, వెంకటేశ్ అయ్యర్, శిఖర్ ధావన్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో టాప్-3లో ఎవరు ఉన్నారు?

IPL 2023: ఐపీఎల్‌లో అగ్రస్థానంలో ఇప్పటికీ ఆ జట్టే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌ల రేసులో ఆ హీరోలు మారారు

Shubman gill

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రస్తుత సీజన్ లో సోమవారం వరకు 24 మ్యాచులు జరిగాయి. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో చెన్నై గెలవడంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి ఒకేసారి మూడో స్థానానికి ఎగబాకింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు జట్లేగాక ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది.

Points Table

Points Table

రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం 5 మ్యాచులు ఆడి, నాలుగింటిలో గెలుపొంది, ఒకదాంట్లో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో లక్నో సూపర్ కింగ్స్ ఉంది. ఆ జట్టు మొత్తం 5 మ్యాచులు ఆడి మూడింట్లో గెలుపొంది, రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. చెన్నై జట్టు ఖాతాలో కూడా 6 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5 మ్యాచులు ఆడి ఒక్కదాంట్లో కూడా గెలవలేదు. ఆ జట్టు 0 పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో ఉంది.

ఐపీఎల్‍లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 259 పరుగులు చేశాడు. రెండో స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఉన్నాడు. అతడు 5 మ్యాచులు ఆడి 234 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది.

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ 4 మ్యాచులు మాత్రమే ఆడి 233 పరుగులు చేశాడు. డు ప్లెసిస్, వెంకటేశ్ అయ్యర్, శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్ రేసులో పోటీ పడుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ లీడర్ బోర్డులో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

అతడు 5 మ్యాచులు ఆడి 11 వికెట్లు తీశాడు. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ బౌలర్ మార్క్ వుడ్ (4 మ్యాచుల్లో), గుజరాత్ జెయింట్స్ బౌలర్ రషీద్ ఖాన్ (5 మ్యాచులు) 11 చొప్పున వికెట్లు తీసి వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాడు.

IPL Worst Records: టాప్-10 చెత్త రికార్డులు.. మరీ ఇంత తక్కువ పరుగులా?