IPL 2023 RRVsPBKS : పోరాడి ఓడిన రాజస్తాన్ రాయల్స్

IPL 2023 RR Vs PBKS: 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.

IPL 2023 RRVsPBKS : పోరాడి ఓడిన రాజస్తాన్ రాయల్స్

RR vs PBKS

IPL 2023 RRVsPBKS : ఐపీఎల్ 2023 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు పోరాడి ఓడింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.

రాజస్తాన్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్(42), షిమ్రన్ హెట్ మైర్(18 బంతుల్లో 36 పరుగులు), ధృవ్ జురెల్(15 బంతుల్లో 32 పరుగులు-నాటౌట్) రాణించారు. పడిక్కల్ 21, రియాన్ పరాగ్ 20, బట్లర్ 19 పరుగులు చేశారు. చివరల్లో హెట్ మైర్, ధృవ్ ధాటిగా ఆడినా.. పరాజయం తప్పలేదు. రాజస్తాన్ బ్యాటర్లు భారీ షాట్లకు యత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎలిస్ విజృంభించాడు. 4 వికెట్లు తీసి రాజస్తాన్ ఓటమిని శాసించాడు. అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు.

Also Read..MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 60 రన్స్), కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 86 రన్స్-నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

Also Read..Kane Williamson Video: అయ్యయ్యో.. కుడి కాలు కదిలించలేని స్థితిలో సొంత దేశానికి కేన్ విలియమ్సన్