IPL 2023: రాజ‌స్థాన్‌పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023: రాజ‌స్థాన్‌పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

RR vs RCB

RR vs RCB: ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన రాజ‌స్థాన్ 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 May 2023 06:25 PM (IST)

    బెంగ‌ళూరు విజ‌యం

    ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన రాజ‌స్థాన్ 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో బెంగ‌ళూరు 112 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

  • 14 May 2023 06:09 PM (IST)

    ధ్రువ్ జురెల్ ఔట్‌

    రాజ‌స్థాన్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. బ్రాక్ వెల్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌(1) భారీ షాట్ కొట్ట‌గా లోమ్రోర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ 31 ప‌రుగుల(6.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద 6 వికెట్లు కోల్పోయింది.

  • 14 May 2023 05:37 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో బ‌ట్ల‌ర్, శాంస‌న్ ఔట్‌

    రాజ‌స్థాన్ కు వ‌రుసగా షాక్‌లు త‌గులుతున్నాయి. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. వేన్ పార్నెల్ బౌలింగ్‌లో రెండో బంతికి(1.2వ‌) బ‌ట్ల‌ర్‌(0) సిరాజ్ చేతికి చిక్క‌గా, నాలుగో బంతికి సంజుశాంస‌న్‌(4) అనుజ్ రావత్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 11/3. జో రూట్‌(1), ప‌డిక్క‌ల్‌(4) క్రీజులో ఉన్నారు.

  • 14 May 2023 05:29 PM (IST)

    జైశ్వాల్ ఔట్‌

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన రాజ‌స్థాన్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్‌లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైపాల్ రెండో బంతికే డ‌కౌట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 1 ఓవ‌ర్‌కు రాజ‌స్థాన్ స్కోరు 5/1. సంజు శాంస‌న్‌(4), బ‌ట్ల‌ర్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 14 May 2023 05:10 PM (IST)

    రాజ‌స్థాన్ ల‌క్ష్యం 172

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కెప్టెన్ పాప్ డుప్లెసిస్‌(55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మాక్స్‌వెల్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు.

  • 14 May 2023 04:52 PM (IST)

    మాక్స్ వెల్ అర్ధ‌శ‌త‌కం

    చాహ‌ల్ బౌలింగ్‌లో(16.5వ ఓవ‌ర్‌) సిక్స్ కొట్టి మాక్స్‌వెల్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

  • 14 May 2023 04:45 PM (IST)

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో డుప్లెసిస్‌, లోమ్రోర్ ఔట్‌

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో బెంగ‌ళూరు రెండు వికెట్లు కోల్పోయింది. కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో(14.5వ ఓవ‌ర్‌) జైస్వాల్ క్యాచ్ అందుకోవ‌డంతో డుప్లెసిస్‌(55) ఔట్ అయ్యాడు. ఆ వెంట‌నే ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో(15.1 ఓవ‌ర్‌) మహిపాల్ లోమ్రోర్(1) ధృవ్ జురెల్ చేతికి చిక్కాడు. దీంతో బెంగ‌ళూరు 120 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 14 May 2023 04:38 PM (IST)

    డుప్లెసిస్ అర్ధ‌శ‌త‌కం

    కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో(14.2వ ఓవ‌ర్‌) సిక్స్ కొట్టిన డుప్లెసిస్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

  • 14 May 2023 04:04 PM (IST)

    విరాట్ కోహ్లి ఔట్‌

    ఎట్ట‌కేల‌కు రాజ‌స్థాన్ వికెట్ ప‌డ‌గొట్టింది. కేఎం ఆసీఫ్ బౌలింగ్‌లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లి(18) ఔట్ అయ్యాడు. దీంతో బెంగ‌ళూరు 50 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 50/1.

  • 14 May 2023 03:59 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న బెంగ‌ళూరు ఓపెన‌ర్లు

    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది బెంగ‌ళూరు. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు ఫాఫ్ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లి లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తున్నారు. 6 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 42/0. ఫాఫ్ డుప్లెసిస్‌(23), విరాట్ కోహ్లి(17)లు క్రీజులో ఉన్నారు.

  • 14 May 2023 03:22 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

  • 14 May 2023 03:21 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు

    యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

  • 14 May 2023 03:20 PM (IST)

    ఆర్‌సీబీ బ్యాటింగ్‌

    టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజ‌స్థాన్ త‌మ జ‌ట్టులో ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ట్రెంట్ బౌల్ట్‌ను ప‌క్క‌న పెట్టి ఆడ‌మ్ జంపాకు తుది జ‌ట్టులో అవ‌కాశం క‌ల్పించింది.