IPL 2023 Song Video: “జోరుగా హుషారుగా” అంటూ ఐపీఎల్ తెలుగు సాంగ్.. అదుర్స్

"జోరుగా హుషారుగా" అంటూ సాగుతున్న ఈ పాటలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సాంగ్‌లో మరింత జోష్‌ నింపారు. టాటా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా స్టార్ స్పోర్ట్స్ వన్‌ తెలుగు అద్భుతమైన టాటా ఐపీఎల్ గీతాన్ని రీలీజ్ చేసింది.

IPL 2023 Song Video: “జోరుగా హుషారుగా” అంటూ ఐపీఎల్ తెలుగు సాంగ్.. అదుర్స్

IPL 2023 Song Video

IPL 2023 Song Video: క్రికెట్ ప్రేమికుల అతిపెద్ద వేడుక… ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023” పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టాటా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా స్టార్ స్పోర్ట్స్ వన్‌ తెలుగు అద్భుతమైన టాటా ఐపీఎల్ గీతాన్ని రీలీజ్ చేసింది.

“జోరుగా హుషారుగా” అంటూ సాగుతున్న ఈ పాటలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సాంగ్‌లో మరింత జోష్‌ నింపారు. ఈ సారి మరింత ఉత్సాహంతో వస్తున్న ఐపీఎల్ జట్లు .. సొంత గ్రౌండ్లలో కఠినమైన పోటీని ఎదుర్కోబోతున్నాయి. ఇక మార్చి 31 నుంచి టాటా ఐపీఎల్ మ్యాచుల అసలైన మజాని స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగులో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఐపీఎల్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి మే 28 వరకు ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో తొలి మ్యాచు జరగనుంది. తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడతాయి. మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచులు ఉంటాయి. చివరి లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరుగుతుంది. మే 28న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

 

ఐపీఎల్ షెడ్యూల్ ఇదే..

 IPL 2023 Song Video


IPL 2023 Song Video