IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏఏ తేదీల్లో, ఏఏ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయో తెలుసా?

ఐపీఎల్ 2023‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడతుంది. ఇందులో ఏడు మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లు ఇతర రాష్ట్రాల్లోని స్టేడియంలలో జరుగుతాయి.

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏఏ తేదీల్లో, ఏఏ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయో తెలుసా?

SRH Matchs schedule

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL) 16వ సీజన్ ప్రారంభమైంది. గతనెల 31న తొలిమ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. 52రోజులు పాటు జరిగే టోర్నీలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి.  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలిపోరుకు సిద్ధమైంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో తలపడుతుంది.  మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టేడియం వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో సేవల సమయం పెంపు.. 60 ప్రత్యేక బస్సులు ..

ఐపీఎల్ 2023‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడతుంది. ఇందులో ఏడు మ్యాచ్‌లో ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లు ఇతర రాష్ట్రాల్లోని స్టేడియంలలో జరుగుతాయి. సన్ రైజర్స్ జట్టు ఏప్రిల్ నెలలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడనుంది. మే నెలలో ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. ఏప్రిల్ నెలలో 2, 7, 9, 14, 18, 21, 24, 29 తేదీల్లో, మే నెలలో 4, 7, 13, 15, 18, 21 తేదీల్లో సన్‌రైజర్స్ జట్టు ప్రత్యర్థి జట్లతో తలపడుతుంది.

 

ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు ఇవే..

– ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS రాజస్థాన్ రాయల్స్ ( 3.30 PM)

– ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS పంజాబ్ కింగ్స్ ( 7.30 PM)

– ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS ముంబయి ఇండియన్స్ (7.30PM)

– ఏప్రిల్ 24న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS ఢిల్లీ కేపిటల్స్ (7.30 PM)

– మే 4న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS కోల్‌కతా నైట్‌రైడర్స్(7.30 PM)

– మే 13న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS లక్నో సూపర్ జెయింట్స్ (3.30 PM)

– మే 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ VS రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (7.30 PM)