IPL-2023, Videos: ఐపీఎల్ మ్యాచులకు సిద్ధమవుతున్న ఆటగాళ్లు.. అలరిస్తున్న వీడియోలు

ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు... తోటి ప్లేయర్లను కలిసి సరదాగా మాట్లాతున్నారు. విదేశీ ప్లేయర్లు కూడా ఇప్పటికే భారత్ చేరుకున్నారు.

IPL-2023, Videos: ఐపీఎల్ మ్యాచులకు సిద్ధమవుతున్న ఆటగాళ్లు.. అలరిస్తున్న వీడియోలు

IPL-2023, Videos

IPL-2023, Videos: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) మ్యాచులు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 28 వరకు 16వ సీజన్ ఐపీఎల్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇందులో ఆడే 10 జట్లు… ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

ఐపీఎల్ మ్యాచులు దేశంలోని 12 ప్రాంతాల్లో జరగనున్నాయి. 10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. చివరి లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. మే 28న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఆయా జట్ల ప్లేయర్లు తమ తోటి ఆటగాళ్లను కలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆయా జట్ల ఫ్రాంచైజీలు ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాయి. ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోలు అలరిస్తున్నాయి. ఆ వీడియోలు మీ కోసం…

 

BCCI Annual Contracts: గ్రేడ్ ‘ఏ’ ప్లస్ లో రోహిత్, కోహ్లీ సహా మరో ఇద్దరు.. ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల రూపాయలో తెలుసా?