ఐపీఎల్ వేలం..164 మంది ఇండియన్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు

ఐపీఎల్ వేలం..164 మంది ఇండియన్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు

IPL-auction

IPL auction: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ మినీ వేలానికి టైమ్ ద‌గ్గర ప‌డుతోంది. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి చెన్నైలో ఈ – వేలం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియ‌న్ క్రికెటర్లు కాగా.. 125 మంది విదేశీ ఆటగాళ్లు. మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయ‌ర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది క్రికెటర్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరుగురు ప్లేయర్లను తీసుకోనుంది. దీని కోసం 19 కోట్ల 90 లక్షలను వెచ్చించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా 8 మంది ఆటగాళ్లను తీసుకోవడానికి 13 కోట్లను ఖర్చు చేయనుంది.
పంజాబ్‌ కింగ్స్‌ 9 మందిని వేలంలో తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం 53 కోట్లను కేటాయించనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది. 10 కోట్ల 75 లక్షలను వెచ్చించనుంది.
ముంబై ఇండియన్స్‌ ఏడుగురు ప్లేయర్లను 15 కోట్ల 35 లక్షలు వెచ్చించి తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 9 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వేలంలో 15 కోట్ల 35 లక్షలను ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది.

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 14 మంది ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం 35 కోట్ల 4 లక్షలు కేటాయించనుంది. స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌ కూడా ముగ్గురు ప్లేయర్లను 10 కోట్ల 75 లక్షలు వెచ్చించి వేలంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది.