IPL Auction 2022 : రెండో రోజు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం..లివింగ్ స్టోన్‌‌‌‌కు అదిరిపోయే ధర

ఐపీఎల్-2022 మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. మొదటిరోజు వేలంలో ఇండియన్ ప్లేయర్లకు జాక్‌పాట్ తగిలిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ గా పేరొందిన లివింగ్ స్టోన్ భారీ ధర పలికాడు

IPL Auction 2022 : రెండో రోజు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం..లివింగ్ స్టోన్‌‌‌‌కు అదిరిపోయే ధర

Ipl Auction 2022

Livingstone Was Sold : ఐపీఎల్-2022 మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. మొదటిరోజు వేలంలో ఇండియన్ ప్లేయర్లకు జాక్‌పాట్ తగిలిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ గా పేరొందిన లివింగ్ స్టోన్ భారీ ధర పలికాడు. ఇతడిని రూ. 11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతడి కనీస ధర రూ. కోటి. లివింగ్ స్టోన్ ను దక్కించుకోవడానికి గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. అయితే.. అనూహ్యంగా సన్ రైజర్స్ పోటీకి వచ్చింది. చివరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతర క్రీడాకారుల విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ డొమినిక్ డ్రెక్స్ ను రూ. 1.10 కోట్లకు వేలం పాడి కొనుగోలు చేసింది. ఇక విజయశంకర్ రూ. 1.4 కోట్లకు, జయంత్ యాదవ్ ను రూ. 1.70 కోట్లకు వేలం పాడి గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

Read More : Navodaya : తెలంగాణా నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాలకు ఎంపిక

లక్నో సూపర్ జెయింట్స్ రూ. 90 లక్షలకు వేలం పాడి కృష్ణప్ప గౌతమ్ ను కొనుగోలు చేసింది. కనీస ధర రూ. 50 లక్షలున్న దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జెన్ సన్ ను రూ. 4.20 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ క్రీడాకారుడు ఒడియన్ స్మిత్ ను పంజాబ్ కింగ్స్ రూ. 6 కోట్లకు దక్కించుకుంది. రూ. 50 లక్షల కనీస ధరగా ఉన్న మన్ దీప్ సింగ్ ను ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన శివమ్ దూబెను రూ. 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

Read More : Jobs : అనంతపురం ప్రభుత్వవైద్య కళాశాలలో ఒప్పంద పోస్టుల భర్తీ

మొదటి రోజు జరిగిన వేలంలో ఇండియన్ ప్లేయర్లకు జాక్‌పాట్ తగిలింది. టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ అతన్ని 15కోట్ల 25లక్షలకు దక్కించుకుంది. దీపక్‌ చాహర్‌ను సీఎస్కే 14 కోట్లకు దక్కించుకోగా.. శ్రేయర్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్12కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 8 కోట్ల 25 లక్షలకు ధావన్‌ను దక్కించుకుంది. రవిచంద్రన్ అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ 5 కోట్లకు సొంతం చేసుకుంది. పేసర్‌ మహ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ 6 కోట్లతో 25 లక్షలకు దక్కించుకుంది.

Read More : Siddhu Jonnalagadda : ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

విదేశీ ఆటగాళ్లకు కూడా భారీ ధరలు దక్కాయి. వెస్టిండియన్ ప్లేయర్ నికోలస్‌ పూరన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ రబడ కసం ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ పొటీపడ్డప్పటికీ..చివరకు 9 కోట్ల 25 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆల్‌ రౌండర్‌ జాసన్ హోల్డర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ 8 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసుకుంది. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను 8 కోట్లతో రాజస్థాన్ సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను 6 కోట్ల 25 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.