IPL2023 final: వరుణుడి ఎఫెక్ట్.. ఐపీఎల్ ఫైనల్ వాయిదా
వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అంపైర్లు వాయిదా వేశారు.

IPL2023 final CSK vs GT
IPL2023: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డేన నిర్వహించాలని అంపైర్లు నిర్వహించారు. దీంతో రిజర్వు డేగా ఉన్న మే 29 సోమవారం రోజు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
LIVE NEWS & UPDATES
-
మ్యాచ్ రేపటికి వాయిదా
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ల మధ్య జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూద్దాం అనుకున్న వారికి నిరాశే ఎదురైంది. వరుణుడు ఆటంకం కలిగించాడు. పలు మార్లు తగ్గినట్లే తగ్గి మళ్లీ తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో కనీసం టాస్ వేయడానికి కూడా వీలుపడలేదు. 11 గంటల వరకు కూడా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రేపు కూడా వర్షం ముంపు పొంచిఉన్నట్లు తెలుస్తోంది. కనీసం రేపు అయినా వరుణుడు శాంతించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
-
కట్ ఆఫ్ టైం 12.06 am
క్రికెట్ ఆట చూద్దామని వచ్చిన ప్రేక్షకులతోని వరుణుడు ఆడుకుంటున్నాడు. కొద్ది సేపు శాంతించిన వరుణుడు మళ్లీ ఆటంకం కలిగిస్తున్నాడు. మళ్లీ వర్షం పడుతోంది. ఈ సారి గట్టిగానే పడుతోంది. ఇక 5 ఓవర్ల ఆటకు కట్ ఆఫ్ టైమ్ 12.06am గా ఖరారు చేశారు. అప్పటి వరకు మ్యాచ్ నిర్వహించేందుకు సాధ్యం కాకపోతే రేపు అనగా సోమవారం(మే29) నిర్వహిస్తారు. అయితే.. రేపు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. రేపు కూడా మ్యాచ్ జరగని పక్షంలో గ్రూప్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవనుంది.
-
అభిమానులకు శుభవార్త
స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం తగ్గకపోతే మ్యాచ్ పరిస్తితి ఏంటా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వు డే ఉందా లేదా అని గందరగోళానికి గురి అవుతున్నారు. రిజర్వు డే ఉంది. ఈ రోజు మ్యాచ్ సాధ్యం కాకపోతే రేపు నిర్వహిస్తారు.
-
వరుణుడి ఆటంకం
అనుకున్నట్లుగా ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. పిచ్ పై కవర్లను కప్పారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది.
-
చెన్నై జట్టుకు ఘన స్వాగతం
ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు టీమ్ బస్సులో మైదానానికి చేరుకున్నారు. హోటల్ నుంచి మైదానం చేరుకునే వరకు రోడ్డుకు ఇరువైపులా నిలుచుకున్న అభిమానులు చెన్నైకు మద్దతుగా నినాదాలు చేశారు.
#IPL2023Final #MSDhoni #CSKvGT #GTvCSK
The grand welcome for MS Dhoni and CSK en route Narendra Modi Stadium.pic.twitter.com/4T1VWDeQm0— 👑👌🌟 (@superking1816) May 28, 2023
-
భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్న అభిమానులు
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. స్టేడియం పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిపోయింది.
The Yellow Army outside Ahmedabad stadium 🏟 😍😍😍😍 #gtvscsk #chennaisuperkings #msdhoni #iplfinal 2023@shvetapt341 @DivyaPandey29 @archanapatel_ pic.twitter.com/V6PABbmlc5
— Atul Yadav (@Atulyadav126) May 28, 2023