ఐపీఎల్‌లో గత 12 సీజన్లలో ఎన్ని సిక్సులు కొట్టారో తెలుసా?

  • Published By: vamsi ,Published On : September 15, 2020 / 02:28 PM IST
ఐపీఎల్‌లో గత 12 సీజన్లలో ఎన్ని సిక్సులు కొట్టారో తెలుసా?

ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని స్టేడియాల్లో.. ఐపీఎల్‌‌ రెడీ అయిపోతుంది.. సిక్సర్లు, ఫోర్లు.. అలుపు లేకుండా బాదినోడికి..అందినంత పరుగుల దాహం తీర్చేందుకు సిద్ధం అవుతుంది. బ్యాట్‌‌కు, బాల్‌‌కు మధ్య బ్యాలెన్స్‌‌ ఉండేలా రూపొందించిన పిచ్‌‌లపై సిక్సులు కోసం అభిమానులు ఎదరు చూస్తున్నారు.

ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఐపీఎల్ కాస్త విభిన్నంగానే ఉంటుంది. స్టేడియంలలో ప్రేక్షకులు ఉండరు.. అరుపులు ఉండవ్.. గోలలు ఉండవ్.. ఇక ఈసారి కూడా ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అసలు ఎన్ని సిక్సులు కొట్టారు అనేది తెలుసుకోవడం కాస్త ఆసక్తికర విషయం.




ప్రపంచంలోని అతిపెద్ద టీ 20 లీగ్ అయిన ఐపీఎల్‌లో చివరి 12 సీజన్లలో మొత్తం 8,162 సిక్సర్లు కొట్టారు. ప్రతి సీజన్‌లో ఐపీఎల్‌కు 500 సిక్సర్లు పైగా ఉన్నాయి. ఐపిఎల్ సీజన్‌లో 2018 లో అత్యధికంగా 872 సిక్సర్లు కొట్టారు. 2009లో ఇప్పటివరకు అత్యల్ప సిక్సర్లు కొట్టారు. ఆ సంవత్సరం దాని సంఖ్య 506 గా ఉంది. ఐపీఎల్‌ మొదటి సీజన్లో, 2008 లో దీని సంఖ్య 622 కాగా, చివరి సీజన్లో కూడా సిక్సర్లు భారీగానే ఉన్నాయి.

ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లో సిక్సర్ల సంఖ్య:

-2008 – 622 సిక్సర్లు

-2009 – 506 సిక్సర్లు

-2010 – 585 సిక్సర్లు




-2011 – 639 సిక్సర్లు

-2012 – 731 సిక్సర్లు

-2013 – 674 సిక్సర్లు

-2014 – 714 సిక్సర్లు




-2015 – 692 సిక్సర్లు

-2016 – 638 సిక్సర్లు

-2017 – 705 సిక్సర్లు




-2018 – 872 సిక్సర్లు

-2019 – 784 సిక్సర్లు

ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 125 మ్యాచ్‌ల్లో 326 సిక్సర్లు కొట్టాడు. రెండవ స్థానంలో 154 మ్యాచ్‌ల్లో 212 సిక్సర్లు కొట్టిన ఎబి డివిలియర్స్ ఉన్నారు. మూడో స్థానంలో 190 మ్యాచ్‌ల్లో 209 సిక్సర్లు కొట్టిన ఎంఎస్ ధోని.