ఐపీఎల్ కొత్త టీజర్: నేను కోహ్లీ కాదు

ఐపీఎల్ కొత్త టీజర్: నేను కోహ్లీ కాదు

ఐపీఎల్ కొత్త టీజర్: నేను కోహ్లీ కాదు

ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా ప్రచారం భారీగా జరుగుతోంది. గతేడాది ప్రచారంంలో.. లీగ్ జరుగుతోంది చాంపియన్ల మధ్య.. గెలిచేది చాంపియన్లే. అంటకూ స్లోగన్ తో మన ముందుకొచ్చిన ఐపీఎల్ ఈసారి గేమ్ బనాయేగా నామ్ అంటూ సందడి చేస్తోంది. ఇప్పటికే ఇదే స్లోగన్‌తో ఒక టీజర్ ను విడుదల చేసిన ఐపీఎల్ మరోసారి అదే పంథాలో మరో టీజర్‌ను విడుదల చేసింది.
Read Also : ఐపీఎల్ ముంగిట హాఫ్ సెంచరీతో మెప్పించిన రైనా

ఓ అపార్ట్ మెంట్‌లో పిల్లలంతా లోకల్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతుంటారు. ప్రతి జట్టులోని ప్లేయర్లు కీలక ఆటగాళ్లతో పాటు కెప్టెన్ల పేర్లు చెప్పుకుని ఒకచోటుకు చేరుకుంటారు. వారందరితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వంతు రాగానే ఒక బుడ్డోడ్ని రమ్మని పిలుస్తారు. కానీ, అతను రాకుండా తనకు కోహ్లీ పేరు చెప్పుకుని ఆడడం ఇష్టం లేదని తనపేరు తానే నిరూపించుకుంటాడని అంటాడు. 

‘అందరూ అతడ్ని చూసి నవ్వుతుంటే, అప్పుడే కోహ్లీ వస్తాడు. వచ్చీరాగానే పేరు వదిలేయ్.. ఆట ఉంది కదా.. చలో పేరు తెచ్చుకుందాం.’ అని కోహ్లీ చెప్పగానే దగ్గర్లో ఉన్నవాళ్లంతా ఆ బుడ్డోడు పేరును జోరున వినిపిస్తుంటారు’ సరిగ్గా ఒక నిమిషంపాటు నిడివి ఉన్న ఈ వీడియోను విడుదల చేసిన ఐపీఎల్ మరోసారి ప్రేక్షకులను అలరించింది. 

×