చెన్నైపై పంజాబ్ విజయం

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 02:07 PM IST
చెన్నైపై పంజాబ్ విజయం

ఐపీఎల్ లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విక్టరీ కొట్టింది. 6 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కే విధించిన 171 పరుగుల టార్గెట్ ని మరో 2 ఓవర్లు మిగిలి  ఉండగానే ఛేజ్ చేసింది. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేసింది. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. 71 పరుగులతో అదరగొట్టాడు. 36 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. గేల్ 28  పరుగులతో, నికోలస్ 36 పరుగులతో రాణించారు. ఆఖరి లీగ్ మ్యాచ్ ను పంజాబ్ జట్టు విజయంతో ముగించింది. పంజాబ్ కి ఇది 6వ గెలుపు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ డు ప్లెసిస్ 96 పరుగులతో చెలరేగాడు. 55 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. సురేష్ రైనా హాఫ్ సెంచరీతో రాణించాడు. 38 బంతుల్లో 53 రన్స్ చేశాడు. ఆఖరి 4 ఓవర్లలో చెన్నై 4 వికెట్లు కోల్పోవడంతో 170 పరుగులకే పరిమితమైంది. ఇరు జట్లకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ విజయంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయినా.. చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోనే ఉంది.