IPL 2022: తొలి సారి 1000 కోట్ల మార్కు చేరుకోనున్న ఐపీఎల్ రెవెన్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.

IPL 2022: తొలి సారి 1000 కోట్ల మార్కు చేరుకోనున్న ఐపీఎల్ రెవెన్యూ

Jay Shah

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.

టీ20 లీగ్ చరిత్రలోనే తొలిసారి పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ లకు కూడా స్పాన్సర్ షిప్ దొరికింది. ఇప్పటికే బీసీసీఐకి సంబంధించిన 9 స్పాన్సర్‌షిప్ స్లాట్లను బీసీసీఐ అమ్మేసింది కూడా. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన షా.. కేవలం స్పాన్సర్‌షిప్‌లతోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటుందని చెప్తున్నారు.

లీగ్ 15 ఏళ్ల చరిత్రలోనే నేరుగా స్పాన్సర్ల ద్వారానే ఇంతటి రెవెన్యూ దక్కించుకోవడం తొలిసారి.

Read Also: రెడీ.. మిస్సైల్ షాట్‌లు దూసుకొస్తున్నాయ్

‘ఐపీఎల్ బ్రాండ్ ఏంటో దీనిని బట్టే స్పష్టంగా తెలుస్తుంది. కొత్త స్పాన్సర్‌షిప్ డీల్స్ తో హ్యాపీగా ఉన్నాం. ఈ ఏడాది అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. సింగిల్ సీజన్ లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఇదే తొలిసారి’ జైషా అన్నారు.