IPL 2022: ఐపీఎల్ టీమ్స్‌లో జట్టుకు నాలుగు రిటెన్షన్లు

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశీవాలీ లీగ్ ఐపీఎల్.. మహమ్మారి లాంటి అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు గడిచిన సీజన్ ను రెండు దఫాలుగా పూర్తి చేశారు.

IPL 2022: ఐపీఎల్ టీమ్స్‌లో జట్టుకు నాలుగు రిటెన్షన్లు

New Project

IPL 2022: ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేశీవాలీ లీగ్ ఐపీఎల్.. మహమ్మారి లాంటి అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు గడిచిన సీజన్ ను రెండు దఫాలుగా పూర్తి చేశారు. రాబోయే సీజన్ కు మరింత ముస్తాబై ఇతర జట్లను కలుపుకుని లీగ్ ఉంటుందని బీసీసీఐ ముందే చెప్పింది. ఇదిలా ఉంటే వేలానికి వచ్చే ముందు రిటెన్షన్ లిస్టులో కొంత మంది ప్లేయర్లను అంటిపెట్టుకుంటారా.. అని వస్తున్న సందేహాలపై క్లారిటీ ఇచ్చారు.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ).. టీమ్ ప్రతినిధులు కలిసి ప్రతి ఫ్రాంచైజీ నలుగురు చొప్పున ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చని చెప్పింది. ఒక్కో జట్టు ముగ్గురు ఇండియన్ ప్లేయర్లనను, ఇద్దరు విదేశీ ప్లేయర్లను కలిపి నాలుగుకు మించకుండా అట్టిపెట్టుకోవచ్చు. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లను కూడా రెండుకు మించకుండా జట్టులో ఉంచుకోవచ్చు.

కాకపోతే దీని గురించి అధికారికంగా స్టేట్మెంట్ రావాల్సి ఉంది. అక్టోబర్ 25న రెండు కొత్త టీంలు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత రిటైన్షన్ రూల్స్ ను ప్రకటించనున్నారు.

…………………………………………: అక్టోబర్ నెలలో 18 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు

ఏదేమైనా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తమతో పాటు ఉంచుకుంటామని ఎన్ శ్రీనివాసన్ అఫీషియల్ గానే చెప్పేశారు. అతనితో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లను కూడా ఇండియన్ ప్లేయర్లుగా, డీజే బ్రావో, డుప్లెసిస్ లను విదేశీ ప్లేయర్ల జాబితాలో ఉంచుకుంటాడని తెలుస్తోంది.