IPL2022 CSK Vs SRH : రెచ్చిపోయిన రుతురాజ్, కాన్వే.. హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్

ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. చెన్నై ఓపెనర్లు దంచి కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (99), డెవన్ కాన్వే(85) ధాటిగా ఆడారు.

IPL2022 CSK Vs SRH : రెచ్చిపోయిన రుతురాజ్, కాన్వే.. హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్

Ipl2022 Csk Vs Srh

IPL2022 CSK Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు దంచి కొట్టారు. పరుగుల వరద పారించారు. రుతురాజ్ గైక్వాడ్ (99), డెవన్ కాన్వే(85*) ధాటిగా ఆడారు. ఫలితంగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ ముందు 203 పరుగులు బిగ్ టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ కే రెండు వికెట్లు పడ్డాయి.

IPL2022 CSK Vs SRH

IPL2022 CSK Vs SRH

చెన్నై ఓపెనర్లు రుతురాజ్, కాన్వే తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రుతురాజ్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లోనే 99 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకోవడంతో నేరుగా భువనేశ్వర్ కుమార్‌ చేతిలో పడింది. దీంతో రుతురాజ్ కి సెంచరీ చేసే అవకాశం మిస్‌ అయింది. డెవన్ కాన్వే 55 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!

హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. నటరాజన్ కూడా ధారాళంగా పరుగులు (4 ఓవర్లలో 42 పరుగులు) ఇచ్చినా రెండు వికెట్లు తీశాడు.

IPL2022 CSK Vs SRH

IPL2022 CSK Vs SRH

ప్రస్తుత సీజన్‌లో పాయింట్ల టేబుల్ పరంగా అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్న చెన్నైను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలను చేపట్టాడు. రవీంద్ర జడేజా తన ఆటపై దృష్టిసారించేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చెన్నైతో పోరులో టాస్‌ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకుని చెన్నైకి బ్యాటింగ్‌ అప్పగించాడు.

ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలను చేపట్టిన ధోని చెన్నై తలరాతను మారుస్తాడో లేదో చూడాలి. మరోవైపు ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే హైదరాబాద్‌ తప్పక గెలవాలి. గత మ్యాచ్‌లో గుజరాత్‌పై దురదృష్టవశాత్తూ ఓటమిపాలైన హైదరాబాద్‌ మరోసారి అలాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ సీజన్‌లో తొలి రౌండ్‌లో చెన్నైను ఓడించి మరీ హైదరాబాద్‌ పాయింట్ల ఖాతాను ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే.

IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ

జట్ల వివరాలు:

సన్ రైజర్స్ హైదరాబాద్ ‌: అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్, నటరాజన్‌.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవన్‌ కాన్వే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్‌ చౌదరి, మహీశా తీక్షణ.