IPL2022 DC Vs SRH : దంచికొట్టిన డేవిడ్ వార్నర్, పావెల్.. హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్, రోమన్ పొవెల్ దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా వార్నర్ వీరవిహారం చేశాడు.

IPL2022 DC Vs SRH : దంచికొట్టిన డేవిడ్ వార్నర్, పావెల్.. హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్

Ipl2022 Dc Vs Srh

IPL2022 DC Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్ సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 208 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

MS Dhoni: “జడేజాను సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ చేయడం తప్పుడు నిర్ణయం”

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్, రోమన్ పావెల్ దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా వార్నర్ వీరవిహారం చేశాడు. 58 బంతుల్లోనే 92(నాటౌట్) పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో రోమన్ పావెల్ 35 బంతుల్లోనే 67 పరుగులు (నాటౌట్) బాదాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి.

ఈ ఇద్దరూ భారీ షాట్లు ఆడుతూ పరుగుల వరద పారించారు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ జట్టులో ఓపెనర్ మన్‌దీప్ సింగ్‌ (0) డకౌట్‌ కాగా, మిచెల్ మార్ష్‌ (10) నిరాశపరిచాడు. కెప్టెన్‌ పంత్‌ (26) ఫర్వాలేదనించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.(IPL2022 DC Vs SRH)

టీ20 లీగ్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌ చేరుకోవడమే లక్ష్యంగా జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ జట్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే 9 మ్యాచులు ఆడింది. నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. మరి, విజయం ఏ జట్టుని వరిస్తుందో చూడాలి.

Rishabh Pant: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
డేవిడ్ వార్నర్‌, మన్‌దీప్‌ సింగ్‌, మిచెల్ మార్ష్‌, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్‌, రోమన్‌ పావెల్, రిపాల్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆన్రిచ్‌ నార్జ్‌.

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు:
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్‌ కుమార్‌, సీన్‌ అబాట్‌, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్.