IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే | IPL2022 Delhi Capitals Vs MI Mumbai Indians Beats Delhi Capitals

IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే

ఆఖరి లీగ్ మ్యాచ్‌ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీని కూడా ఇంటికి తీసుకెళ్లింది.(IPL2022 DelhiCapitals Vs MI)

IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే

IPL2022 DelhiCapitals Vs MI : ముంబై ఇండియన్స్ గెలిచింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మురిసింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌ లో ముంబై అదరగొట్టింది. విక్టరీతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. అంతేకాదు తనతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ ని కూడా తీసుకెళ్లింది. ఢిల్లీ ఓటమితో బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొంది ఉంటే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకునేది. కానీ కీలక మ్యాచ్‌లో ఢిల్లీ తడబడింది. 160 పరుగులను కాపాడుకోవడంలో విఫలమై ఓటమితో ఇంటిముఖం పట్టింది.(IPL2022 DelhiCapitals Vs MI)

MS Dhoni: ఐపీఎల్‌ 2023లో ఆడటంపై ధోనీ కీలక అప్‌డేట్

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. మోస్తరు స్కోరే (159/6) చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 19.1 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (2) విఫలం కాగా.. ఇషాన్‌ కిషన్ (48), బ్రెవిస్ (37), టిమ్‌ డేవిడ్ (34), తిలక్ వర్మ (21), రమణ్‌దీప్‌ (13*) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్, అన్రిచ్ నోర్జే చెరో రెండు వికెట్లు తీశారు. కుల్‌దీప్‌ యాదవ్ ఒక వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో ముంబై ఒకానొక దశలో తడబడినప్పటికీ.. ఆఖర్లో పుంజుకుని 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఢిల్లీతో పోరులో ముంబై బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. ముంబై ముందు 160 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే… 43 పరుగులతో రోవ్ మాన్ పావెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పావెల్ 34 బంతులాడి 1 ఫోర్, 4 సిక్సులు బాదాడు. అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 24, కెప్టెన్ రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 10 బంతుల్లో 2 సిక్సుల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ 5, సర్ఫరాజ్‌ ఖాన్ 10‌, అక్షర్‌ పటేల్ 19*, శార్దూల్ ఠాకూర్ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. రమణ్‌దీప్‌ సింగ్ రెండు వికెట్లు తీశాడు. డానియల్ సామ్స్, మయాంక్‌ మార్కండే చెరో వికెట్ తీశారు.

కాగా, తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబై గెలిచినా దాన్ని స్థానంలో మాత్రం మార్పు రాలేదు. 14 మ్యాచ్‌లకుగాను నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో సీజన్‌ను ముగించింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లేవో తేలిపోయింది. గుజరాత్‌ (20), రాజస్తాన్‌ (18), లక్నో (18), బెంగళూరు (16) ప్లేఆఫ్స్‌కు చేరాయి.

తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 24, ఎలిమినేటర్‌ మే 25, రెండో క్వాలిఫయర్‌ మే 27న, ఫైనల్‌ మ్యాచ్‌ మే 29న జరుగుతాయి. తొలి క్వాలిఫయర్‌ గుజరాత్-రాజస్తాన్‌ మధ్య, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లక్నో- బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది.

×