IPL2022 GT Vs CSK : రెచ్చిపోయిన రుతురాజ్.. గుజరాత్ టార్గెట్ 170

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్‌కు 170 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది.

IPL2022 GT Vs CSK : రెచ్చిపోయిన రుతురాజ్.. గుజరాత్ టార్గెట్ 170

Ipl2022 Gt Vs Csk

IPL2022 GT Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్‌కు 170 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది.

చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ బాదాడు. రుతురాజ్ 48 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. అంబటి రాయుడు 31 బంతుల్లో 46 పరుగులతో మెరిశాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్‌ జడేజా (21), శివమ్‌ దూబే (19*) రాణించగా.. రాబిన్‌ ఉతప్ప (3), మొయిన్‌ అలీ (1) నిరాశపరిచారు. గుజరాత్‌ బౌలర్లలో జోసెఫ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. యశ్‌ దయాల్‌, షమీ చెరో వికెట్‌ తీశారు.(IPL2022 GT Vs CSK)

Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో అనుకున్నంత స్కోరును చెన్నై చేయలేకపోయింది. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 169 పరుగులకే పరిమితమైంది. గైక్వాడ్‌, అంబటి రాయుడు కలిసి 92 పరుగులను జోడించారు. అయితే దూకుడుగా ఆడుతున్న వీరిద్దరూ ఔట్‌ కావడంతో పరుగుల రాక మందగించింది. ఆఖర్లో శివమ్‌ దూబే (19), రవీంద్ర జడేజా (22*) దూకుడుగా ఆడారు.

ఓవైపు కొత్త కుర్రాళ్లతో విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది గుజరాత్ టైటాన్స్. మరోవైపు తన 5వ మ్యాచులో తొలి గెలుపు రుచి చూసిన చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్ల పోరులో గుజరాత్‌ గెలిచి తన అగ్రస్థానం నిలబెట్టుకుంటుందో.. చెన్నై తొలి విజయం ఊపును కొనసాగిస్తుందో చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌ వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య తప్పుకున్నాడు.

Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ : రాబిన్ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్‌ జొర్డాన్, మహీశ తీక్షణ, ముకేశ్‌ చౌదరి

గుజరాత్ టైటాన్స్ టీమ్ ‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్, విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్‌ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్‌ (కెప్టెన్‌), అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్, మహమ్మద్‌ షమీ

Dinesh Karthik: “టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నా”