IPL2022 GT Vs DC : ఢిల్లీ పరాజయం.. గుజరాత్ ఖాతాలో రెండో విజయం

ఈ పోరులో ఢిల్లీ కేపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది.

IPL2022 GT Vs DC : ఢిల్లీ పరాజయం.. గుజరాత్ ఖాతాలో రెండో విజయం

Ipl2022 Gt Vs Dc

IPL2022 GT Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో ఢిల్లీ కేపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్ పంత్ టాప్ స్కోరర్. పంత్ 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. లలిత్ యాదవ్(25), రోమన్ పావెల్(20) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అదరగొట్టాడు. 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్య, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. మెగా టీ20 టోర్నీలో గుజరాత్‌ కి ఇది రెండో విజయం. కాగా, ఢిల్లీ ఈ టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది.

IPL 2022 LSG Vs CSK : చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్.. నేరుగా మహిళ తలమీదకు సిక్సు బాదేసిన ఆయుష్ బదోనీ

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులు బాది 84 పరుగులు చేశాడు.

మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (1) ఆరంభంలోనే వెనుదిరిగినా… కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తెవాటియా 14 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”