IPL2022 Gujarat Vs CSK : తిరుగులేని గుజరాత్.. చెన్నైపై విజయం

ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ తగ్గేదేలే అంటోంది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది.

IPL2022 Gujarat Vs CSK : తిరుగులేని గుజరాత్.. చెన్నైపై విజయం

Ipl2022 Gujarat Vs Csk

IPL2022 Gujarat Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ తగ్గేదేలే అంటోంది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది.

గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా (67*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సాహా 57 బంతుల్లో 67 పరుగులు చేశాడు. మాథ్యూ వేడ్ (20), శుభ్‌మన్‌ గిల్‌ (18) ఫర్వాలేదనిపించారు. డేవిడ్‌ మిల్లర్‌ (15*) నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో మతీశా పతిరానా రెండు వికెట్లు పడగొట్టాడు. మొయిన్‌ అలీ ఒక వికెట్‌ తీశారు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిన గుజరాత్‌కు ఈ సీజన్‌లో ఇది పదో విజయం కాగా, చెన్నైకి తొమ్మిదో ఓటమి.

Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ

గుజరాత్ తో పోరులో చెన్నై విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి కేవ‌లం 133 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. చెన్నై ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ (53) హాఫ్‌ సెంచ‌రీతో రాణించాడు. చెన్నై స్టార్ బ్యాట‌ర్ శివ‌మ్ దూబే ఈ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. గైక్వాడ్‌కు తోడు నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ (39), మొయిన్ అలీ (21) ప‌రుగులు చేయ‌డంతో చెన్నై ఆ మాత్రం స్కోరు అయినా చేయ‌గ‌లిగింది.

ఇక గుజ‌రాత్ టైటాన్స్ బౌలింగ్ విష‌యానికి వ‌స్తే… కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌హా బౌల‌ర్లంతా పెద్ద‌గా వికెట్లు తీయ‌కున్నా… చెన్నై బ్యాట‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా నిలువ‌రించ‌గ‌లిగారు. మొహ్మ‌ద్ ష‌మీకి 2 వికెట్లు ద‌క్క‌గా… ర‌షీద్ ఖాన్‌, జోసెఫ్‌, సాయి కిశోర్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.

IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి

ఈ సీజన్ లో 13 మ్యాచులు ఆడిన గుజరాత్.. 10 విజయాలతో 20 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మరోవైపు చెన్నై జట్టు 13 మ్యాచులు ఆడింది. 4 విజయాలతో 9వ స్థానంలో ఉంది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఔటయ్యింది.

గుజరాత్‌ టైటాన్స్ జట్టు : సాహా, శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, రవి శ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, అల్జారీ జోసెఫ్‌, యశ్‌ దయాల్‌, షమీ.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : రుతురాజ్‌ గైక్వాడ్‌, కాన్వే, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబే, నారాయణ్ జగదీశన్‌, ధోనీ, మిచెల్‌ శాంట్నర్‌, ప్రశాంత్‌ సోలంకీ, సిమర్‌జీత్‌ సింగ్‌, ముకేశ్‌ చౌదరి, పతిరానా.