IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్

తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ గర్జించింది. రాజస్తాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై..

IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్

Ipl2022 Gujarat Vs Rr

IPL2022 Gujarat Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్‌ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ గర్జించింది. రాజస్తాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్‌(68*) మెరుపు దాడి చేయగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్య ‌(40*), శుభ్‌మన్‌(35), వేడ్‌(35) కూడా రాణించడంతో విజయం సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మెక్‌కాయ్‌ చెరో వికెట్‌ తీశారు.

De Villiers: ఐపీఎల్ రిటర్న్ కన్ఫామ్ చేసిన డివిలియర్స్

డేవిడ్ మిల్లర్ దంచికొట్టాడు. 38 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ హార్ధిక్ పాండ్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు ఉన్నాయి.(IPL2022 Gujarat Vs RR)

Hardik Pandya

Hardik Pandya

సంజూ సేన నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్‌ నేరుగా ఫైనల్‌ చేరుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు రాజస్తాన్ కు ఇంకో ఛాన్సుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ లో విజేతతో రాజస్తాన్ తలపడుతుంది. మే 25న (బుధవారం) ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది.

Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఓపెనర్ జోస్ బట్లర్ బాదుడుతో భారీ స్కోర్ సాధించింది. బట్లర్ 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. బట్లర్ స్కోరులో 12 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది.

ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) అవుట్ కాగా, బట్లర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడిచ్చిన కొన్ని క్యాచ్ లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడవడం కలిసొచ్చింది. బట్లర్ మొదట్లో నిదానంగా ఆడినా, ఆఖర్లో బ్యాట్ ఝుళిపించి స్కోరు పెంచాడు.

కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 20 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. హెట్మెయర్ (4), పరాగ్ (4) విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యశ్ దయాళ్, సాయి కిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.