IPL2022 Hyderabad Vs KKR : రెచ్చిపోయిన రస్సెల్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..

కోల్ కతా బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్‌ (49*), సామ్‌ బిల్లింగ్స్‌ (34), అజింక్య రహానె (28), నితీశ్‌ రానా (26) రాణించారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో..

IPL2022 Hyderabad Vs KKR : రెచ్చిపోయిన రస్సెల్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..

Ipl2022 Hyderabad Vs Kkr

IPL2022 Hyderabad Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 178 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

కోల్ కతా బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్‌ (49*), సామ్‌ బిల్లింగ్స్‌ (34), అజింక్య రహానె (28), నితీశ్‌ రానా (26) రాణించారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. చివర్లో రస్సెల్‌ రఫ్పాడించాడు వాషింగ్టన్ సుందర్‌ వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సులు బాదాడు. వెంకటేశ్‌ అయ్యర్ 7, శ్రేయస్‌ అయ్యర్ 15, రింకూ సింగ్‌ 5 పరుగులు చేశారు.

IPL 2022: సీఎస్కేకు కెప్టెన్‌గా ఆ యువక్రికెటర్ కరెక్ట్ అంటోన్న సెహ్వాగ్

IPL2022 Hyderabad Vs KKR Sunrisers Hyderabad Target 178

IPL2022 Hyderabad Vs KKR Sunrisers Hyderabad Target 178

హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, నటరాజన్‌ చెరో వికెట్ తీశారు.

తొలి రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి సంచలనంగా మారిన హైదరాబాద్‌.. ఆ తర్వాత డీలా పడింది. నాలుగు ఓటములతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కష్టంగా మార్చుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే హైదరాబాద్‌ కు ఛాన్స్‌ ఉంటుంది.

IPL2022 Bangalore Vs Punjab : బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం

మరోవైపు కోల్‌కతాకు కూడా ఇది కీలక మ్యాచే. ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు ముగిసినా టెక్నికల్ గా ఇంకా రేసులోనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ అవకాశాలను కోల్‌కతా  అడ్డుకుంటుందా?లేదా అనేది చూడాలి. హైదరాబాద్‌ జట్టులోకి మళ్లీ జాన్‌సెన్‌ వచ్చాడు. ఈసారి నలుగురు ఫాస్ట్‌ బౌలర్లతో హైదరాబాద్ బరిలోకి దిగింది.

జట్ల వివరాలు:

సన్ రైజర్స్ హైదరాబాద్ ‌: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్ సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, శశాంక్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్, ఉమ్రాన్‌ మాలిక్.

కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేశ్‌ అయ్యర్, అజింక్య రహానె, నితీశ్‌ రానా, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), సామ్‌ బిల్లింగ్స్‌, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి.