IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

IPL2022 Hyderabad Vs PBKS : టీ20 మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఫీల్డింగ్ వైఫల్యం, క్యాచ్‌ల డ్రాప్‌లతో హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంతో పంజాబ్ టోర్నీని ముగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. లియామ్ లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్ ఖాన్ (19), జితేశ్ శర్మ (19) రాణించారు. లియామ్ లివింగ్ స్టోన్ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను హైదరాబాద్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.
Umran Malik Call Up : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. సంచలన పేసర్‌కు టీమిండియాలో చోటు
పంజాబ్ తో పోరులో టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీతో హైదరాబాద్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. పంజాబ్‌కు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ 43, రొమారియా షెపర్డ్ 26 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 25, మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు.
Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్
ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (4), నికోలాస్ పూరన్ (5) విఫలమయ్యారు. సుందర్-షెఫెర్ట్ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు మిడిల్ లో, చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకోవడంతో హైదరాబాద్ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడాకు ఒక వికెట్ దక్కింది.
That’s that from Match 70 as @PunjabKingsIPL end their campaign on a winning note. Win by 5 wickets in 15.1 overs.
Scorecard – https://t.co/MmucFYpQoU #SRHvPBKS #TATAIPL pic.twitter.com/ujbQsZaUMz
— IndianPremierLeague (@IPL) May 22, 2022
- IPL 2022: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”
- IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”
- IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్లోనే కప్పు నెగ్గి చరిత్ర
- IPL 2022 Final Match : ఫైనల్లో గుజరాత్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్తాన్
- IPL 2022: టాస్ వేసేటప్పుడు రవిశాస్త్రి చెవిలో పాండ్యా
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం