IPL2022 KKR Vs LSG : తిరుగులేని లక్నో.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ.. ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో ఆల్ రౌండ్ షో తో ఘన విజయం సాధించింది. 75 పరుగుల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన లక్నో.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది.

IPL2022 KKR Vs LSG : తిరుగులేని లక్నో.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ.. ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు

Ipl2022 Kkr Vs Lsg

IPL2022 KKR Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ లో 15లో లక్నో సూపర్ జెయింట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో ఖాతాలో మరో విజయం చేరింది. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో ఆల్ రౌండ్ షో తో ఘన విజయం సాధించింది. 75 పరుగుల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన లక్నో.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది.

లక్నో నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా తేలిపోయింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్ కతా బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్‌ (45), సునీల్ నరైన్‌ (22), ఆరోన్‌ ఫించ్‌ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌, జాసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.. మోహ్‌సిన్‌ ఖాన్‌, చమీర, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే

తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది. దీంతోపాటు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.

కీలకమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతాకు 177 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. డికాక్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో మూడు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీపక్‌ హుడా (41), కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (28), అయుష్‌ బదోని (15*), జాసన్ హోల్డర్ (13) రాణించారు.

కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. కాగా, శివమ్‌ మావి వేసిన 19 ఓవర్‌లో లక్నో బ్యాటర్లు ఏకంగా ఐదు సిక్సర్లు బాదడం విశేషం. ఇందులో మూడు స్టొయినిస్‌ కొట్టగా.. మరో రెండు హోల్డర్‌ బాదాడు.

David Warner: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన లక్నో 8 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో (16) నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక కోల్ కతా జట్టు 14 మ్యాచులు ఆడగా 4 విజయాలే నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా (8) ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టుకి తిరుగులేకుండా పోయింది. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో.. సమష్టిగా రాణిస్తూ విజయాలను నమోదు చేస్తోంది.

IPL2022 KKR Vs LSG Lucknow Super Giants Won On Kolkata By 75 Runs

IPL2022 KKR Vs LSG Lucknow Super Giants Won On Kolkata By 75 Runs

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆరోన్‌ ఫించ్‌, బాబా ఇంద్రజిత్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), నితీశ్‌ రానా, రింకు సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్‌ మావి, హర్షిత్‌ రానా.

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్‌ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్‌, మోహ్‌సిన్ ఖాన్‌.