IPL2022 Kolkata Vs Rajasthan : రాణించిన సంజూ శాంసన్.. కోల్‌కతా ముందు మోస్తరు లక్ష్యం

టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి..(IPL2022 Kolkata Vs Rajasthan)

IPL2022 Kolkata Vs Rajasthan : రాణించిన సంజూ శాంసన్.. కోల్‌కతా ముందు మోస్తరు లక్ష్యం

Ipl2022 Kkr Vs Rr

IPL2022 Kolkata Vs Rajasthan : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 153 పరుగుల మోస్తరు లక్ష్యం నిర్దేశించింది.

భారీ హిట్టర్లు ఉన్న రాజస్తాన్ జట్టును కోల్ కతా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. రాజస్తాన్ భారీ స్కోర్ ఆశలకు కోల్ కతా బౌలర్లు కళ్లెం వేశారు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు.

IPL2022 KKR Vs RR Kolkata Knight Riders Target 153

IPL2022 KKR Vs RR Kolkata Knight Riders Target 153

రాజస్తాన్ బ్యాటర్లలో సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్ 49 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. హెట్‌ మైర్ (25*), జోస్‌ బట్లర్‌ (22), పరాగ్‌ (19) తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు. (IPL2022 Kolkata Vs Rajasthan)

MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే

టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకుని రాజస్తాన్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాజస్తాన్‌ను ముంబై ఓడించి బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ పరాజయం పాలైంది. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడగా.. ఆరు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ (12) మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే రాజస్తాన్‌ తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఘోర ప్రదర్శనతో కేవలం మూడు మ్యాచ్‌లను నెగ్గిన కోల్‌కతాకు ఇక నుంచి ప్రతి మ్యాచూ చావోరేవో లాంటిది. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్‌ దారులు మూసుకుపోతాయి.

IPL2022 SRH Vs CSK : ధోని నాయకత్వం.. హైదరాబాద్‌పై చెన్నై ఘన విజయం

జట్ల వివరాలు:

రాజస్తాన్‌ రాయల్స్ : జోస్ బట్లర్‌, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), కరుణ్‌ నాయర్‌, షిమ్రోన్ హెట్‌ మైర్, రియాన్‌ పరాగ్, రవిచంద్రన్‌ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్ కృష్ణ, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్‌ సేన్.


కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆరోన్‌ ఫించ్‌, సునిల్ నరైన్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), బాబా ఇంద్రజిత్‌, నితీశ్‌ రానా, అనుకుల్ రాయ్‌, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్‌, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి.