IPL2022 KKR Vs RR : హ్యాట్రిక్‌తో కోల్‌కతాను దెబ్బతీసిన చాహల్.. రాజస్తాన్‌ థ్రిల్లింగ్ విక్టరీ

ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కోల్ కతాపైరాజస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చాహల్ (5/40) హ్యాట్రిక్‌ వికెట్లతో..

IPL2022 KKR Vs RR : హ్యాట్రిక్‌తో కోల్‌కతాను దెబ్బతీసిన చాహల్.. రాజస్తాన్‌ థ్రిల్లింగ్ విక్టరీ

Ipl2022 Kkr Vs Rr

IPL2022 KKR Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. యుజ్వేంద్ర చాహల్ (5/40) హ్యాట్రిక్‌ వికెట్లు తీసి కోల్ కతాను దెబ్బకొట్టాడు. రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాజస్తాన్ నిర్దేశించిన 218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా.. టార్గెట్ సమీపం వరకు వచ్చింది. కానీ ఛేజ్ చేయలేకపోయింది. 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో 7 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది.

కోల్ కతా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయ్యర్ 51 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. కాగా, అయ్యర్ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. కోల్ కతాకు ఓటమి తప్పలేదు. చివర్లో ఉమేశ్ యాదవ్ ధనాధన్ ఇన్నింగ్ ఆడాడు. గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. 9 బంతుల్లోనే 21 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు.(IPL2022 KKR Vs RR)

BCCI: “మహిళా క్రికెట్ జట్టు కోసం మగాళ్ల డ్రెస్సులు సైజ్ చేశారు”

రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో దుమ్మురేపాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. చాహల్ మ్యాజిక్ చేశాడు. మ్యాచ్ ని మలుపు తిప్పాడు. కోల్ కతా చేతి నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నాడు. ఇక మెక్ కాయ్ రెండు వికెట్లు తీశాడు. ప్రసిధ్‌ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ (103) బౌండరీల మోత, చాహల్‌ (5/40) బుల్లెట్‌ బంతులతో.. కోల్‌కతాపై రాజస్తాన్‌ ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్‌తో పాటు కెప్టెన్‌ సంజూ (38), హెట్‌మయర్‌ (26*) రాణించారు. ఆపై లక్ష్యఛేదనలో కోల్‌కతా 210 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా బ్యాటర్లలో ఆరోన్ ఫించ్ (58), శ్రేయస్‌ (85), ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (21) ఆకట్టుకున్నారు.

టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమే. విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్తేనే అవకాశం దక్కుతుంది. ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకుని రాజస్తాన్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. అత్యధిక పరుగుల జాబితాలో టాపర్‌గా ఉన్న జోస్ బట్లర్‌, అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా ఉన్న చాహల్‌ తమ స్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. ఓటములతో సతమతం అవుతున్న కోల్ కతా.. మళ్లీ విజయాలబాట పట్టాలని ఆశించింది. కానీ ఓటమే ఎదురైంది.

రాజస్తాన్ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ మరోసారి చెలరేగాడు. శతకం బాదాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో బట్లర్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. బట్టర్ వీర బాదుడుతో రాజస్తాన్ రాయల్స్ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేశాడు. బట్లర్ ఓ భారీ సిక్స్ తో సెంచరీ మార్కు అందుకోవడం విశేషం.

బట్లర్ స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. బట్లర్ క్రీజులో ఉన్నంత సేపు ఏ దశలో రన్ రేట్ 10కి తగ్గలేదు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (24), కెప్టెన్ సంజు శాంసన్ (38)లతో కలిసి బట్లర్ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

IPL 2022 : సన్ రైజర్స్ వరుస విక్టరీలు.. కావ్యా మారన్‌.. లాఫింగ్ టైమ్.. ట్విట్టర్‌లో కామెంట్లు..!

చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 మార్కు దాటింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్, శివం మావి చెరో వికెట్ తీశారు.

జట్ల వివరాలు:

రాజస్తాన్ రాయల్స్ టీమ్‌: సంజూ శాంసన్‌ (కెప్టెన్), జోస్ బట్లర్‌, దేవదుత్ పడిక్కల్, కరుణ్‌ నాయర్, హెట్‌ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్‌ కృష్ణ, మెక్‌కాయ్, చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ : వెంకటేశ్‌ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), నితీశ్‌ రాణా, ఆండ్రూ రస్సెల్, షెల్డన్ జాక్‌సన్, సునిల్ నరైన్, ప్యాట్ కమిన్స్, శివమ్‌ మావి, ఉమేశ్‌ యాదవ్, వరుణ్ చక్రవర్తి