IPL2022 LSG Vs PBKS : రాణించిన పంజాబ్ బౌలర్లు.. లక్నో ఎంత స్కోర్ చేసిందంటే

ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి..

IPL2022 LSG Vs PBKS : రాణించిన పంజాబ్ బౌలర్లు.. లక్నో ఎంత స్కోర్ చేసిందంటే

Ipl2022 Lsg Vs Pbks

IPL2022 LSG Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసింది.

లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్‌ డికాక్ (46 పరుగులు 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (34) తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (6), కృనాల్ పాండ్య (7), స్టొయినిస్‌ (1), ఆయుష్‌ బదోనీ (4), జేసన్‌ హోల్డర్‌ (11), చమీర (17) పరుగులు చేశారు. మోసిన్‌ ఖాన్‌ (13), అవేశ్ ఖాన్‌ (2) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు(38 పరుగులు) పడగొట్టాడు. రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు(30 పరుగులు), సందీప్‌ శర్మ ఒక వికెట్(18 పరుగులు) తీశారు.(IPL2022 LSG Vs PBKS)

IPL2022 DC Vs KKR : కోల్‌కతాను మరోసారి చిత్తు చేసిన ఢిల్లీ

ఈ మ్యాచ్ టాస్ నెగ్గిన పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకు లీగ్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన విషయానికొస్తే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్‌ కింగ్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

పంజాబ్ కింగ్స్ జట్టు:
శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్‌), భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జానీ బెయిర్‌స్టో, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్, సందీప్‌ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు:
క్వింటన్ డాకాక్‌ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య, జేసన్ హోల్డర్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్, మోహ్ సిన్ ఖాన్‌.