IPL2022 LSG Vs SH : రాణించిన రాహుల్, హుడా.. హైదరాబాద్ టార్గెట్ 170

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హైదరాబాద్ కు 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

IPL2022 LSG Vs SH : రాణించిన రాహుల్, హుడా.. హైదరాబాద్ టార్గెట్ 170

Ipl2022 Lsg Vs Sh (1)

IPL2022 LSG Vs SH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హైదరాబాద్ కు 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో రాణించారు. రాహుల్ 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. దీపక్ హుడా 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.(IPL2022 LSG Vs SH)

ICC CEO : ఒలింపిక్స్‌‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే హైదరాబాద్ బౌలర్లు వరుస షాకులిచ్చారు. దీంతో పవర్‌ ప్లేలోనే లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ కేఎల్ రాహుల్, దీపక్‌ హుడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో క్వింటన్‌ డి కాక్‌ (1), ఎవిన్‌ లూయిస్‌ (1), మనీశ్ పాండే (11), కృనాల్ పాండ్య (6) విఫలమయ్యారు. ఆఖరు బంతికి ఆయుష్ బదోని (19) రనౌటయ్యాడు. జేసన్‌ హోల్డర్‌ (8) నాటౌట్‌గా నిలిచాడు.

మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు.. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఆ తర్వాత చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. మరోవైపు, రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో పరాజయం పాలైన హైదరాబాద్‌ జట్టు.. ఈ మ్యాచులోనైనా బోణీ కొడుతుందేమో చూడాలి. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెత్త బౌలింగ్, చెత్త బ్యాటింగ్ తో ఓటమిని కొని తెచ్చుకుంది హైదరాబాద్.

లక్నో తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. రాజస్తాన్ తో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్.. లక్నోతో మ్యాచ్ లో మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రొమారియో షెపర్డ్ తలా రెండు వికెట్లతో మెరవడంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.

IPl 2022 : గుజరాత్-ఢిల్లీ మ్యాచ్‌లో ట్విస్ట్.. లలిత్ యాదవ్ ఎలా రనౌట్ అయ్యాడంటే?

తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగింది. లక్నో మాత్రం ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ లో విఫలమైన చమీర స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. గత సీజన్ లో జేసన్ హోల్డర్ సన్ రైజర్స్ కు ఆడటం విశేషం.

తుది జట్ల వివరాలు..
హైదరాబాద్‌ : కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రొమెరియో షెఫర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్, టి. నటరాజన్‌, ఉమ్రాన్ మాలిక్

లఖ్‌నవూ : కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్‌ డి కాక్‌ (వికెట్ కీపర్‌), మనీశ్ పాండే, ఎవిన్‌ లూయిస్, దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోని, కృనాల్‌ పాండ్య, జేసన్‌ హోల్డర్‌, రవి బిష్ణోయ్‌, ఆండ్రూ టై, అవేశ్‌ ఖాన్‌