IPL2022 Mumbai Vs KKR : కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన కోల్‌కతా.. ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం

ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓటమి పాలైంది. కోల్ కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసింది.

IPL2022 Mumbai Vs KKR : కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన కోల్‌కతా.. ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం

Ipl2022 Mi Vs Kkr

IPL2022 Mumbai Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ మళ్లీ ఓటమి బాట పట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఓటమి పాలైంది. కీలక మ్యాచ్ లో కోల్ కతా అదరగొట్టింది. కోల్ కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేక రోహిత్ సేన చేతులెత్తేసింది. 17.3 ఓవర్లలోనే 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ముంబైపై కోల్‌కతా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే రాణించాడు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 2, తిలక్ వర్మ 6, రమణ్‌దీప్‌ సింగ్ 12, టిమ్‌ డేవిడ్ 13, కీరన్‌ పొలార్డ్‌ 15, డానియల్‌ శామ్స్ 1, కుమార్‌ కార్తికేయ 3 పరుగులు చేశారు.(IPL2022 Mumbai Vs KKR)

IPL 2022: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్

కోల్ కతా బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రూ రసెల్ రెండు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా చెలరేగాడు. 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్ కతా మోస్తరు స్కోరే చేసింది.

మొత్తంగా కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా అదరగొట్టేసింది. ఈ సీజన్ లో ముంబైకి ఇది తొమ్మిదో ఓటమి. కాగా, కోల్‌కతాకు ఐదో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా (10) ఏడో స్థానానికి చేరుకుంది. దీంతోపాటు ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

IPL2022 DC Vs CSK : కీలక పోరులో ఢిల్లీకి షాక్.. చెన్నై ఘన విజయం

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ : ఇషాన్‌ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రమన్‌దీప్‌ సింగ్‌, కీరన్‌ పొలార్డ్, టిమ్‌ డేవిడ్, డానియల్ శామ్స్‌, మురుగన్‌ అశ్విన్, కుమార్‌ కార్తికేయ, బుమ్రా, మెరెడిత్‌.

కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానె, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్‌ రానా, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్‌ జాక్‌సన్, టిమ్‌ సౌథీ, ప్యాట్ కమిన్స్‌, వరుణ్ చక్రవర్తి.