IPL2022 MI Vs PBKS : చెలరేగిన ధావన్, మయాంక్.. ముంబై ముందు భారీ లక్ష్యం

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

IPL2022 MI Vs PBKS : చెలరేగిన ధావన్, మయాంక్.. ముంబై ముందు భారీ లక్ష్యం

Ipl2022 Mi Vs Pbks

IPL2022 MI Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబైకి 199 పరుగుల బిగ్ టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

శిఖర్ ధావన్ 50 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 బంతుల్లో 52 రన్స్ చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. జితేశ్ శర్మ (15 బంతుల్లో 30 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బసిల్ తంపి రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్‌ ఉనద్కత్‌, బుమ్రా, మురుగన్ అశ్విన్‌ తలో వికెట్ తీశారు.

IPL 2022: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటోన్న యువతి

పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్‌ (52), మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (70) హాఫ్ సెంచరీలతో దంచికొట్టగా.. బెయిర్‌ స్టో (12), లివింగ్‌ స్టోన్ (2), షారూక్‌ ఖాన్‌ (15) విఫలమయ్యారు. జితేశ్ శర్మ (30*), ఓడీన్‌ స్మిత్ (1*) నాటౌట్‌గా నిలిచారు. ఆఖర్లో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ (15) రెండు సిక్సులు బాదాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా.. అన్నింట్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానం దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్ లో ముంబై, పంజాబ్‌ జట్లు హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. ముంబై 15 మ్యాచుల్లో.. పంజాబ్ 13 మ్యాచుల్లో నెగ్గాయి.

Ambati Rayudu : గాల్లోనే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్.. అంబటి అదరహో.. షాకింగ్ వీడియో..!

తుది జట్ల వివరాలు..
ముంబై : ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవీస్, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, మురుగన్ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, టైమల్ మిల్స్‌, బసిల్ తంపి.

పంజాబ్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఓడీన్‌ స్మిత్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, వైభవ్‌ అరోరా.