IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే

ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో ముంబై ఇండియన్స్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది.

IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే

Ipl2022 Mumbai Vs Dc

IPL2022 Mumbai Vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో ముంబై ఇండియన్స్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఢిల్లీ జట్టు మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. ముంబై ముందు 160 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే… 43 పరుగులతో రోవ్ మాన్ పావెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పావెల్ 34 బంతులాడి 1 ఫోర్, 4 సిక్సులు బాదాడు. అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 24, కెప్టెన్ రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 10 బంతుల్లో 2 సిక్సుల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ 5, సర్ఫరాజ్‌ ఖాన్ 10‌, అక్షర్‌ పటేల్ 19*, శార్దూల్ ఠాకూర్ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. రమణ్‌దీప్‌ సింగ్ రెండు వికెట్లు తీశాడు. డానియల్ సామ్స్, మయాంక్‌ మార్కండే చెరో వికెట్ తీశారు.

Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ, ముంబై జట్లుకు ఇదే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ ఫలితంపై రెండు జట్ల ప్లేఆఫ్స్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇందులో విజయం సాధిస్తే ఢిల్లీ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం బెంగళూరు ముందుడుగు వేస్తుంది. అయితే ముంబైకి కూడా ఈ విజయంతో ఒక అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌ను అట్టడుగు స్థానంతో కాకుండా తొమ్మిదో స్థానంతో ముగించే ఛాన్స్‌ ఉంది. అయితే భారీ విజయం సాధిస్తేనే అది సాధ్యమవుతుంది.

MS Dhoni: ఐపీఎల్‌ 2023లో ఆడటంపై ధోనీ కీలక అప్‌డేట్

మరి ముంబై మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరును గట్టెక్కిస్తుందా..? లేక ముంబైని కట్టడి చేసి ఢిల్లీ విజయం సాధిస్తుందో చూడాలి.