IPL2022 PBK Vs CSK : దంచికొట్టిన ధావన్.. చెన్నై ముందు బిగ్ టార్గెట్

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్న సూపర్ కింగ్ ముందు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ దంచికొట్టాడు.

IPL2022 PBK Vs CSK : దంచికొట్టిన ధావన్.. చెన్నై ముందు బిగ్ టార్గెట్

Ipl2022 Pbk Vs Csk

IPL2022 PBK Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 188 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

పంజాబ్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ దంచికొట్టాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. ధావన్ 59 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ ఒక వికెట్ తీశాడు.

IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం

పంజాబ్ జట్టులో ధావన్‌ కాకుండా మయాంక్‌ అగర్వాల్ 18, భానుక రాజపక్స 42, లియామ్‌ లివింగ్ స్టోన్ 19, జానీ బెయిర్‌స్టో 6 పరుగులు చేశారు. చెన్నై ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం పంజాబ్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు ఫీల్డర్లు సులువైన క్యాచ్‌లనూ వదిలేస్తున్నారు. జడేజా బౌలింగ్‌లో పంజాబ్‌ బ్యాటర్ రాజపక్స (19*) ఆరు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద సాంట్నర్‌ జారవిడిచాడు. దీంతో ఆ బంతికి ఆరు పరుగులు వచ్చాయి. అంతకుముందు రాజపక్స ఇచ్చిన క్యాచ్‌నే రుతురాజ్‌ గైక్వాడ్ నేలపాలు చేశాడు. అప్పుడు రాజపక్స స్కోరు 1. చెన్నై బౌలింగ్‌ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ ఫీల్డింగ్‌ మెరుగు పడాల్సి ఉంది.

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఏడేసి మ్యాచులు ఆడాయి. పంజాబ్‌ (6 పాయింట్లు) మూడు విజయాలను నమోదు చేయగా.. చెన్నై (4 పాయింట్లు) రెండింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత మ్యాచ్‌లో ముంబైపై చివరి ఓవర్‌లో ధోనీ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన చెన్నై టోర్నీలో మూడో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ధోనీతోపాటు బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. అలానే కెప్టెన్ మారినా ఆఖర్లో తడబడటం మాత్రం పంజాబ్‌ను వదల్లేదు. ప్లేయర్లు బాగానే ఆడుతున్నప్పటికీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. మరి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో పంజాబ్‌ ఏం చేస్తుందో చూడాలి.

IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ, మిచెల్‌ సాంట్నర్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, డ్వేన్‌ బ్రావో, ముకేశ్‌ చౌదరి, మహీశా తీక్షణ

పంజాబ్ కింగ్స్ ‌: మయాంక్‌ అగర్వాల్, శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోమ్, జితేశ్‌ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌