IPL2022 PBKS Vs GT : చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. గుజరాత్ స్వల్ప సోర్‌కే పరిమితం

పంజాబ్ బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో..(IPL2022 PBKS Vs GT)

IPL2022 PBKS Vs GT : చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. గుజరాత్ స్వల్ప సోర్‌కే పరిమితం

Ipl2022 Pbks Vs Gt

IPL2022 PBKS Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో గుజరాత్ జట్టు లో స్కోర్ కే పరిమితమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది. అతికష్టం మీద ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పంజాబ్‌కు 144 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.(IPL2022 PBKS Vs GT)

గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ (64*) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. సుదర్శన్‌తో పాటు సాహా (21) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవారెవరూ పెద్దగా ఆడలేదు. శుభ్‌మన్ గిల్ (9), వృద్ధిమాన్‌ సాహా (21), హార్దిక్‌ పాండ్య (1), డేవిడ్ మిల్లర్ (11), పరుగులు చేయలేకపోయారు. ఫినిషర్‌గా మారిన రాహుల్ తెవాతియా (11) విఫలమయ్యాడు. రషీద్‌ ఖాన్‌ (0), ప్రదీప్‌ సాంగ్వాన్‌ (2), ఫెర్గుసన్‌ (5) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ చెలరేగాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్‌ సింగ్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్‌ తీశారు.(IPL2022 PBKS Vs GT)

ఈ సీజన్ లో గుజరాత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గుజరాత్‌ (16) ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోగా.. పంజాబ్‌ విజయాల కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన గుజరాత్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకుని పంజాబ్‌కు బౌలింగ్‌ అప్పగించాడు. ప్రస్తుతం పంజాబ్‌ (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సి ఉంటుంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న గుజరాత్‌ను పంజాబ్‌ ఏమాత్రం అడ్డుకోగలదో చూడాల్సిందే.(IPL2022 PBKS Vs GT)

జట్ల వివరాలు:

గుజరాత్ టైటాన్స్ ‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్‌ ఖాన్, అల్జారీ జోసెఫ్‌, ప్రదీప్ సంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ.

పంజాబ్ కింగ్స్ ‌: మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్, సందీప్‌ శర్మ.