IPL2022 PBKS Vs LSG : పంజాబ్‌ని చిత్తు చేసిన లక్నో.. థర్డ్ ప్లేస్‌లోకి రాహుల్ సేన

ఈ మ్యాచ్ లో పంజాబ్ పై గెలిచి తన ఖాతాలో మరో విజయం వేసుకుంది లక్నో. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి..

IPL2022 PBKS Vs LSG : పంజాబ్‌ని చిత్తు చేసిన లక్నో.. థర్డ్ ప్లేస్‌లోకి రాహుల్ సేన

Ipl2022 Pbks Vs Lsg

IPL2022 PBKS Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ పై లక్నో గెలిచి తన ఖాతాలో మరో విజయం వేసుకుంది. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో పంజాబ్ పై విక్టరీ కొట్టింది లక్నో.

పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో (32), మయాంక్ అగర్వాల్ (25), లివింగ్ స్టోన్ (18), శిఖర్‌ ధావన్ (5), భానుక రాజపక్స (9), జితేశ్‌ శర్మ (2), రిషి ధావన్‌ (21), రబాడ (2), రాహుల్ చాహర్‌ (4) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. చమీర, కృనాల్‌ పాండ్య చెరో రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది లక్నో సూపర్ జెయింట్స్. టోర్నీలో ఇప్పటివరకు లక్నో జట్టు 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించగా, పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది.

Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లు స్వేచ్చగా ఆడలేకపోయారు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులే చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 46, దీపక్ హుడా 34 ఓ మోస్తరుగా రాణించారు. ఆఖర్లో దుష్మంత చమీర 17, మొహిసిన్ ఖాన్ 13(నాటౌట్), జాసన్ హోల్డర్ 11 పరుగులు చేయడంతో లక్నో జట్టుకు ఆమాత్రం స్కోరైనా వచ్చింది.

పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఆరంభంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో లక్నో భారీ స్కోరు ఆశలను దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (7), మార్కస్ స్టొయినిస్ (1) విఫలమయ్యారు.

IPL2022 DC Vs KKR : కోల్‌కతాను మరోసారి చిత్తు చేసిన ఢిల్లీ

పంజాబ్ కింగ్స్ జట్టు:
శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్‌), భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జానీ బెయిర్‌స్టో, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్, సందీప్‌ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు:
క్వింటన్ డాకాక్‌ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య, జేసన్ హోల్డర్‌, దుష్మంత
చమీర, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్, మోహ్ సిన్ ఖాన్‌.