IPL2022 PBKS Vs MI : ఐదుసార్లు ఛాంపియన్ ముంబైకి వరుసగా 5వ ఓటమి.. పంజాబ్ చేతిలో చిత్తు

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తలరాత మారలేదు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై జట్టుని పరాజయాలు వెంటాడుతున్నాయి.

IPL2022 PBKS Vs MI : ఐదుసార్లు ఛాంపియన్ ముంబైకి వరుసగా 5వ ఓటమి.. పంజాబ్ చేతిలో చిత్తు

Ipl2022 Pbks Vs Mi

IPL2022 PBKS Vs MI : ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తలరాత మారలేదు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై జట్టుని పరాజయాలు వెంటాడుతున్నాయి. వరుసగా 5వ మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో ముంబై పరాజయం పాలైంది.

లక్ష్యఛేదనలో ముంబై మళ్లీ చతికిలపడింది. 199 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రోహిత్ సేన.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది. ముంబై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవీస్ (49), సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్‌ వర్మ (36) మాత్రమే రాణించారు. రోహిత్‌ శర్మ (28) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో ఓడీన్‌ స్మిత్‌ 4 వికెట్లు పడగొట్టాడు. రబాడ రెండు వికెట్లు తీశాడు. వైభవ్‌ అరోరా ఒక వికెట్‌ తీశాడు.(IPL2022 PBKS Vs MI)

Ambati Rayudu : గాల్లోనే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్.. అంబటి అదరహో.. షాకింగ్ వీడియో..!

ముంబై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవీస్ 25 బంతుల్లో 49 పరుగులు..4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్‌ (43) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (36), కెప్టెన్ రోహిత్ శర్మ (28) పరుగులతో రాణించారు. అయినా కీలక సమయంలో పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో ముంబై బ్యాటర్ల పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ (3), కీరన్‌ పొలార్డ్‌ (10), జయదేవ్ ఉనద్కత్‌ (12) విఫలమయ్యారు. బుమ్రా (0) డకౌటయ్యాడు. ఆఖరు బంతికి టైమల్ మిల్స్‌ (0) క్యాచ్‌ ఔటయ్యాడు. మురుగన్ అశ్విన్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ దంచి కొట్టింది. పంజాబ్ స్టార్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ చెలరేగిపోయాడు. ముంబై బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. మరో ఎండ్ లో కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ మెరిశాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మ‌రోవైపు మ‌యాంక్ కూడా గ‌బ్బ‌ర్‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఆడాడు. 32 బంతుల్లో 52 రన్స్ చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

కెప్టెన్ ఔటైన త‌ర్వాత రెండు వికెట్లు వెంటవెంటనే ప‌డిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌చ్చిన జితేశ్ శ‌ర్మ (30) కూడా బ్యాట్ ఝుళిపించాడు. గ‌బ్బ‌ర్ ఔటయ్యాక‌… జితేశ్‌కు జ‌త క‌లిసిన షారూఖ్ ఖాన్ కేవలం 5 బంతుల్లోనే 15 ప‌రుగులు చేసి స్కోరు బోర్డును ప‌రుగులెత్తించాడు. వెర‌సి పంజాబ్ కింగ్స్ త‌న 20 ఓవ‌ర్ల బ్యాటింగ్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్‌కు 199 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బసిల్ తంపి రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్‌ ఉనద్కత్‌, బుమ్రా, మురుగన్ అశ్విన్‌ తలో వికెట్ తీశారు.

IPL 2022: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటోన్న యువతి

ఈ టోర్నీలో ఈసారి ముంబై ఇండియన్స్ ఆటతీరు చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. మరోవైపు, పంజాబ్ ఖాతాలో మూడో విజయం చేరింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ సీజన్ లో 5 మ్యాచుల్లో మూడు గెలవగా, రెండింటిలో ఓడింది.