IPL2022 Punbaj Vs RCB : బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం

పంజాబ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా పంజాబ్ జట్టు భారీ స్కోర్ బాదింది.(IPL2022 Punbaj Vs RCB)

IPL2022 Punbaj Vs RCB : బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం

Ipl2022 Pbks Vs Rcb

IPL2022 Punbaj Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శుక్రవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ బాదింది. పంజాబ్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 210 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.

పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. పరుగుల వరద పారించారు. బెయిర్ స్టో 29 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. శిఖర్‌ ధావన్‌ (21) ఫర్వాలేదనిపించాడు. మయాంక్‌ అగర్వాల్ 19, జితేశ్‌ శర్మ 9, హర్‌ప్రీత్‌ బ్రార్ 7, రిషిధావన్‌ 7, రాహుల్ చాహర్‌ 2 పరుగులు చేశారు.(IPL2022 Punbaj Vs RCB)

IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు

బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వనిందు హసరంగ రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

కాగా, ఒక్క విజయం నమోదు చేస్తే చాలు బెంగళూరుకు ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమైపోతుంది. మరోవైపు పంజాబ్‌ కూడా ప్రతి మ్యాచ్‌ను గెలిస్తేనే అవకాశాలు సజీవంగా ఉండే పరిస్థితి. పంజాబ్ తో పోరులో టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ

మయాంక్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలతో కేవలం పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దీంతో సహా మిగిలిన మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే పంజాబ్‌కు అవకాశాలు ఉంటాయి. బెంగళూరు మాత్రం తన ఆఖరి రెండింట్లో ఒక్కటి గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు రాణిస్తున్న వేళ బెంగళూరును పంజాబ్‌ బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి.

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్‌ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, షాహ్‌బాజ్‌ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

పంజాబ్‌ కింగ్స్ : జానీ బెయిర్‌ స్టో, శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, రిషి ధావన్, రాహుల్‌ చాహర్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.