IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం

పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం

Ipl2022 Punjab Vs Srh

IPL2022 Punjab Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

Umran Malik Call Up : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. సంచలన పేసర్‌కు టీమిండియాలో చోటు

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. పంజాబ్‌కు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ 43, రొమారియా షెపర్డ్ 26 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 25, మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు.(IPL2022 Punjab Vs SRH)

Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (4), నికోలాస్ పూరన్ (5) విఫలమయ్యారు. సుందర్‌-షెఫెర్ట్‌ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు మిడిల్ లో‌, చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకోవడంతో హైదరాబాద్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడాకు ఒక వికెట్ దక్కింది.

సుదీర్ఘంగా సాగుతున్న టీ20 మెగా టోర్నీ లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్ ఇదే. అయితే, ఈ మ్యాచ్‌ రిజల్ట్ ప్లేఆఫ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. ఆయా జట్ల స్థానాల్లో మాత్రం మార్పు ఉంటుంది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్న హైదరాబాద్‌, పంజాబ్‌ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్‌ ఎంచుకుని పంజాబ్‌కు బౌలింగ్‌ అప్పగించింది. కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీతో హైదరాబాద్‌ జట్టుకు భువనేశ్వర్ కుమార్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్‌ స్టైల్‌లో అమెరికాలోనూ టీ20 లీగ్

ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరేసి విజయాలతో హైదరాబాద్‌, పంజాబ్‌ 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. పంజాబ్‌ ఏడో స్థానం, హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆరో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఓడిన టీమ్‌ ఎనిమిదో స్థానంతోనే సీజన్‌ను ముగిస్తుంది. మరోవైపు కోల్‌కతా 7వ స్థానానికి దిగజారుతుంది.