IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..

రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సీఎస్కే మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై..(IPL2022 Rajasthan Vs CSK)

IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..

Moeen Ali

IPL2022 Rajasthan Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సీఎస్కే మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులే చేసింది.

చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93) అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరిపోరు సాగించాడు. మొయిన్ అలీ 57 బంతుల్లోనే 93 పరుగులు చేయడం విశేషం. ఇతర బ్యాట్స్ మెన్ విఫలమైనా, మొయిన్ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఈ ఇంగ్లండ్ ఆటగాడి స్కోరులో 13 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. మొయిన్ ఆలీ రాణించడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. రాజస్తాన్ కు 151 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.(IPL2022 Rajasthan Vs CSK)

Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా

మొయిన్‌ అలీ కాకుండా కెప్టెన్ ఎంఎస్ ధోనీ (26), డేవన్‌ కాన్వే (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లలో రుతురాజ్‌ 2, జగదీశన్ 1, అంబటి రాయుడు 3, మిచెల్‌ సాంట్నర్ 1*, సిమర్‌జీత్ 3* పరుగులు చేశారు.

రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, మెక్‌కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్‌ చెరో వికెట్ తీశారు. పవర్‌ ప్లే లో 75 పరుగులు చేసిన చెన్నై.. మిగతా 14 ఓవర్లలో మరో 75 పరుగులను మాత్రమే చేయగలిగింది.

కాగా, వరుస ఓటములతో చెన్నై జట్టు ఈ టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. మరోవైపు ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్.. చెన్నైతో పోరులో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తును మరింత పదిలం చేసుకుంటుంది. రాజస్తాన్ తో మ్యాచ్ లో చెన్నై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ జట్టులో ఒక మార్పు జరిగింది. జేమ్స్ నీషమ్ స్థానంలో హెట్ మైర్ వచ్చాడు. చెన్నై జట్టులోనూ ఒక మార్పు జరిగింది. శివం దూబే స్థానంలో అంబటి రాయుడు వచ్చాడు.

Virat Kohli: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ