IPL2022 RCB Vs DC : దంచికొట్టిన దినేశ్ కార్తిక్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 190

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు అదరగొట్టింది. భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ ఆఖర్లో పుంజుకుంది.

IPL2022 RCB Vs DC : దంచికొట్టిన దినేశ్ కార్తిక్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 190

Ipl2022 Rcb Vs Dc

IPL2022 RCB Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు అదరగొట్టింది. భారీ స్కోర్ నమోదు చేసింది. డుప్లెసిస్‌ సేన ఆరంభంలో తడబడినప్పటికీ ఆఖర్లో పుంజుకొని చాలెంజింగ్ స్కోర్ చేసింది.

ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. పంత్‌ సేన ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 55), దినేశ్‌ కార్తిక్‌ (34 బంతుల్లో 66*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షాబాద్‌ (32*) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

IPL2022 KKR Vs SRH : చెలరేగిన త్రిపాఠి, మార్‌క్రమ్.. హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

ఆర్సీబీ జట్టులో దినేశ్‌ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. కార్తిక్ స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. షాబాజ్‌ అహ్మద్ కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్‌ (8), అనుజ్‌ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్‌ (6) విఫలమయ్యారు.

పాయింట్ల పట్టికలో మరింత మెరుగవ్వాలంటే ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాల్సిందే. బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బెంగళూరు బౌలింగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతుంది. అద్బుతమైన బౌలర్లు ఉన్నప్పటికీ కీలక సమయాల్లో తేలిపోతున్నారు. మరోవైపు ఢిల్లీ బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో విజయం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

IPL2022 MI Vs LSG : మళ్లీ ఓడిన ముంబై.. వరుసగా 6వ పరాజయం.. లక్నో ఘన విజయం

జట్ల వివరాలు:

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ పటేల్, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌, ఖలీల్ అహ్మద్

బెంగళూరు: డు ప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, సూయష్‌ ప్రభుదేశాయ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్‌