IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం

బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్‌ మరోసారి రాణించాడు. మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.(IPL2022 RR Vs Bangalore)

IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం

Ipl2022 Rr Vs Bangalore

IPL2022 RR Vs Bangalore : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఫైనల్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన క్వాలిఫయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. రాజస్తాన్ రాయల్స్ ముందు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్‌ మరోసారి రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఫామ్ నిరూపించుకున్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాటిదార్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు. అయితే, మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.(IPL2022 RR Vs Bangalore)

VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (7) మరోసారి విఫలం కాగా, కెప్టెన్ డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 24 పరుగులు పర్లేదనిపించారు. లోమ్రోర్ 8, దినేశ్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టిషాక్‌ తగిలింది. విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి వికెట్‌ కీపర్ సంజూ శాంసన్‌కు చిక్కాడు.

తొలి క్వాలిఫయర్‌లో ఓడిన రాజస్తాన్.. ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు ఫైనల్‌ బెర్తు కోసం తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్ ను ఢీకొంటుంది.

 

IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు:

విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌ (కెప్టెన్), రజత్‌ పాటిదార్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తీక్, మహిపాల్‌ లోమ్రార్, షాబాజ్‌ అహ్మద్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్‌వుడ్.

రాజస్తాన్‌ రాయల్స్ జట్టు:

యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవదుత్‌ పడిక్కల్, హెట్‌మయర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజువేంద్ర చాహల్‌, ఒబెద్ మెకాయ్‌.