IPL2022 RR Vs DC : రాణించిన అశ్విన్, పడిక్కల్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే
రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.

IPL2022 RR Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 161 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్ రాణించారు. అశ్విన్ హాఫ్ సెంచరీ బాదాడు. 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
IPL 2022: సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇక ఇంటికే..
యశస్వీ జైస్వాల్ (19) ఫర్వాలేదనిపించాడు. మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్ (7) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్ (3*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు.

IPL2022 RR Vs DC Delhi Capitals Target 161
టీ20 లీగ్‌లో చాలా వరకు మ్యాచులు ముగిశాయి. దీంతో టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక జట్ల విషయానికొస్తే.. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా
రాజస్తాన్ రాయల్స్ జట్టు : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, డస్సెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, కుల్‌దీప్ సేన్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్‌దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్జే.
Chetan Sakariya is our Top Performer from the first innings for his bowling figures of 2/23.
A look at his bowling summary here 👇👇 #TATAIPL #RRvDC pic.twitter.com/DGGQ4OgwgS
— IndianPremierLeague (@IPL) May 11, 2022
- GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
- Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
- IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
- IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
- IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
1VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ